తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు మళ్లీ ఎప్పుడు వస్తారని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉంది.. ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలన్న ఆయన.. ముందుకు వచ్చేవారికి ఒక కేసు స్టడీకి పనికొస్తుందని సలహా ఇచ్చారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడు.. పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది.. ఇది బాగుందా? అని ప్రశ్నించాడు. మర్యాదలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ చాలా మర్యాదగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించాడు.. వెయ్యి సార్లు వైయస్ జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ కల్యాణ్ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని సలహా ఇచ్చారు. బందరు వెళ్లి చెప్పులు వెతుక్కుంటే మంచిది అని సూచించారు. రాష్ట్రంలో హిందూ ధర్మ రక్షణకు వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్ అట.. దేవుడు దగ్గర పెట్టిన దీపంతో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ కొడుకు హిందూ ధర్మ రక్షణకు వచ్చాడట అంటూ అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పయ్యావుల కేశవ్‌కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రూ.900 కోట్లు మాయం అయ్యాయని వాపోతున్నారు.. ఆర్.ఈ.సీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే..: గావుకేకలు. పిచ్చి రాతలు: రాష్ట్రంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారా? అని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ గావు కేకలు పెడుతున్నారు. ఈ పిచ్చి రాతలు, కూతలు, అభూత కల్పనలకు ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం సీఎం శ్రీ వైయస్ జగన్ అని ఆరోపిస్తున్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కూడా మేమే కారణం అని నిందిస్తున్నారు. మా బాబు వస్తేనే పోలవరం పూర్తవుతుందని అంటున్నారు. మీ బాబు వల్లే కదా పోలవరానికి ఈ దుస్థితి పట్టిందన్నది టీడీపీ నేతలు మొదట తెలుసుకోవాలి. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది మీ బాబే కదా.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం మీ బాబే కదా.. దాని వల్లే కదా ప్రాజెక్టు ఆలస్యమవుతుంది. ఈ సత్యాలను మీరు దాచేసి, పెద్దగా కేకలు వేసినంత మాత్రాన దాగవు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. చిత్తశుద్ధితో పని చేస్తున్నాం: పోలవరం ప్రాజెక్టు మీద అత్యంత కీలక దృష్టి పెట్టింది మా ప్రభుత్వం. ఎందుకంటే దాన్ని నాడు మహానేత వైయస్సార్ కలలు కని మొదలుపెట్టిన ప్రాజెక్టు. ఆరోజుల్లోనే ఆయన రూ. 4500 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఆ ప్రాజెక్టు కోసం మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పని చేస్తోంది. సీఎంగా శ్రీ వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఆయన ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కరోనా వల్ల పనుల్లో కాస్త జాప్యం జరిగింది. గత ప్రభుత్వం ప్రాజెక్టులో దేన్నీ పూర్తి చేయలేదు. కనీసం స్పిల్‌వే కూడా పూర్తి చేయలేదు. మేము రాగానే ఆ పని చేశాం. గేట్లు కూడా బిగించాం. స్పిల్‌వేను సంపూర్ణంగా పూర్తి చేసిన ఘనత జగన్‌గారిది. అయినా వారికి అది కనబడదు. కనబడినా రాయరు. ఇంకా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానళ్లను కూడా జగన్‌గారు పూర్తి చేశారు. అంతేకాదు లోయర్‌కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పనులను గత ప్రభుత్వం సగంలో వదిలేస్తే.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి, నదిని డైవర్ట్ చేశాం. మీ నిర్వాకం వల్లే.. అని నిరూపిస్తాను: రూ. 400 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రొటోకాల్ పాటించకుండా మీరు చేసిన పనులే అందుకు కారణం. దమ్ముంటే రండి. నిరూపిస్తాను. అన్నీ చూపిస్తాను. నిజానికి డయాఫ్రమ్ వాల్, ఎప్పుడు కట్టాలో మీకు తెలుసా? రెండు కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసిన తర్వాత, వర్కింగ్ ప్లేస్ నిర్ధారణ చేసిన తర్వాత.. ఎంత వరద వచ్చినా నీరు అక్కడికి చేరకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాలి. కానీ చంద్రబాబు డయాఫ్రమ్ వాల్‌ను ముందే కట్టారు. కాఫర్ డ్యామ్‌లు మొదలుపెట్టి.. మధ్యలో వదిలేశారు. నదిని మళ్లించకముందే కాఫర్ డ్యామ్‌లు పూర్తి కాకముందే, డయాఫ్రమ్ వాల్ కట్టిన ప్రబుద్ధులు. ఇది చరిత్రాత్మక తప్పిదం. రామోజీరావు, మీకు దమ్ముంటే దీన్ని రాయండి. దాన్ని నేను నిరూపిస్తాను కూడా. చంద్రబాబు నిర్వాకం వల్లనే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది. డయాఫ్రమ్ వాల్ వరదల వల్ల దెబ్బ తినలేదు. కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడం వల్లనే అది కొట్టుకుపోయింది. అవి రాసే దమ్ముందా?: నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) వారు వచ్చి, అన్నీ చూశారు. డయాఫ్రమ్ వాల్‌ను మరమ్మతు చేయడమా? లేక కొత్తది కట్టడమా అన్నది నిర్ణయించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. మీ దుర్మార్గ పనుల వల్ల చాలా నష్టం జరిగింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే ఎన్ని వందల కోట్లు అవుతాయో? ఇవన్నీ రాసే ధైర్యం రామోజీరావుకు ఉందా? ఆ దమ్ము రాధాకృష్ణకు ఉందా? డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదాన్ని రుజువు చేయడానికి నేను సిద్ధం. పోలవరం ప్రాజెక్టుపై ఈనాడులో రాసిన పిచ్చి వార్తలకు ఇదే నా సమాధానం. పయ్యావుల పిచ్చి మాటలు: ఇక పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శల విషయానికొస్తే... రాయలసీమ ఎత్తిపోతల పథకాల్లో రూ. 900 కోట్లు దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన భారీ కుంభకోణం అని ఆయన దుయ్యబట్టారు. ఆ మొత్తం కన్సాలిడేట్ ఫండ్‌లోకి రాకుండా, నేరుగా ఏజెన్సీ ఖాతాలోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. దానికి నేను సమాధానం చెబుతాను. పనులు జరగకుండానే డబ్బులిచ్చారని పయ్యావుల ఆరోపించారు. కోట్లు చేతులు మారాయని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఆయనవి పిచ్చి మాటలు. ఈనాడులో రాతలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను తొలుత భావించాను. దీంతో మళ్లీ పయ్యావుల కేశవ్ స్పందించారు. దాన్ని ఈనాడులో పెద్దగా రాశారు. నేను స్పందించలేదు కాబట్టి, నేరం అంగీకరించినట్లే అని రాశారు. అయితే మీరు, ఈనాడు కలిసి శిక్ష వేయండి. నాకు గతంలో పయ్యావుల కేశవ్ విద్యావంతుడని, సంస్కారం ఉన్నవాడని అనుకునే వాణ్ని. కానీ ఆయన మెదడు కూడా లోకేశ్ మైండ్ మాదిరిగా దొబ్బిందని ఇప్పుడు అర్ధమైంది. రూ.739.5 కోట్లు చెల్లింపు: గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూ. 900 కోట్ల రుణం తీసుకున్న విషయం వాస్తవం. ఆ రుణం ప్రభుత్వ ఖాతాలోకి రాకుండా, నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాలోకి వెళ్లాయని, ఇది భారీ కుంభకోణమని మీరు ఆరోపిస్తున్నారు. నేను దీనికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. కాంట్రాక్టర్లకు ఆర్‌ఈసీ నేరుగా చెల్లించిన మొత్తం రూ. 900 కోట్లు కాదు. రూ. 739.5 కోట్లు మాత్రమే. జరిగిన పనులన్నింటినీ పక్కాగా చెక్ చేశారు. ఫీల్డ్ ఇంజనీర్లు పరిశీలించారు. ఎంబుక్‌లో రికార్డ్ చేశారు. తర్వాత క్వాలిటీ కంట్రోల్ వారు కూడా చూశారు. పనులు డ్రాయింగ్ ప్రకారమే జరిగాయని నిర్ధారించుకున్నాక, సీఎంఎఫ్‌ఎస్‌లో లోడ్ చేశారు. ఆ తర్వాత ఆర్‌ఈసీ వాళ్లు 15.03.2023న ప్రాజెక్టును సందర్శించి, అన్ని పనులు జరిగాయని నిర్ధారించుకుని నిధులు విడుదల చేశారు. అది కూడా ఎంత అంటే.. కాంట్రాక్టర్‌కు రూ. 706 కోట్లు, రూ. 33.5 కోట్లు ప్రభుత్వానికి (సెస్, జీఎస్‌టీ, లేబర్ సెస్, ఐటీ వగైరా) ఇచ్చారు. అది ఆర్‌ఈసీ విధానం: అయితే ఇది అన్యాయం, అక్రమం అంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఆర్‌ఈసీ విధానం అది. ఎప్పుడైనా వారు అలాగే నిధులు విడుదల చేస్తారు. మధ్యలో ప్రభుత్వానికి నిధులు ఇస్తే, వాటిని మళ్లిస్తారని వారు భావిస్తారు. తమిళనాడులో కూడా ఆర్‌ఈసీ ఈ విధానంలోనే నేరుగా నిధులు కాంట్రాక్టర్‌కు విడుదల చేస్తుంది. ఇది చట్టపరమైన విధానం. దీంట్లో ఎక్కడా, ఏ కుంభకోణం జరగలేదు. వారు వచ్చారు. పనులు చూశారు. అన్నీ పరిశీలించారు. ఆ తర్వాతే నిధులు విడుదల చేశారు. దీంట్లో ఏ కుంభకోణం లేదు. మీరు సీబీఐ దర్యాప్తు వేసుకుంటారో లేక ఇంకా ఏ దర్యాప్తు అయినా చేసుకొండి. మాకు అభ్యంతరం లేదు. పనుల్లో జాప్యం నివారణ కోసం ఆర్‌ఈసీ పెట్టిన నియమం. ఇది వాస్తవం. ఇలాంటి విషయాలు మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. పవన్ ఏకపత్నీవ్రతుడు: పవన్‌కళ్యాణ్ నిన్న తణుకు సభలో మరోసారి ఊగిపోయాడు. జగన్‌గారిని అంటే మాకు కోపం వస్తుంది. ఆయన పెళ్ళిళ్ల గురించి మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది అట. కానీ నిత్యం ఆయన పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్‌కు మాత్రం ఏ కోపం రాదు. ఆయన ఒక కార్మిక వీరుడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జనసేన ఆఫీస్‌కు రహస్య సొరంగ మార్గం తవ్వడానికి పని చేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల మనోహర్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవరించింది అంటే పవన్‌కళ్యాణ్‌కు కోపం వచ్చింది. ఇక నుంచి పవన్ పెళ్ళిళ్ల గురించి అనొద్దుఅట. అంటే, ఆయనకు కోపం వస్తుంది. అందుకే ఇక నుంచి మీ పెళ్ళిళ్ల గురించి ఎత్తం. అందుకు బదులుగా, ఒక్కోసారి ఒక్కో పెళ్ళి చేసుకున్న ‘ఏకపత్నీ వ్రతుడు పవన్‌కళ్యాణ్‌గారు’ అని మాత్రమే అంటాం. అప్పుడు ఆయనకు చాలా ఆనందంగా ఉంటుంది. ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’అంటే ఇదీ..: నిన్న తణుకు సభలో పవన్‌ను చూశాం. ఆయన కొద్దిసేపు శాంతంగా మాట్లాడాడు. క్షణాల్లోనే ఆవేశంతో ఊగిపోయాడు. ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనేది ఎలా ఉంటుందో నిన్న పవన్‌కళ్యాణ్ చూపాడు. .. అంటూ ఆ వీడియోను మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రదర్శించారు. ఇదీ పవన్‌కళ్యాణ్‌గారి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. దాన్ని తణుకులో అద్భుతంగా ప్రదర్శించారు. దీనికి వైద్యం చేసే వారు ఎవరైనా ఉంటే చూపండి. పవన్ కల్యాణ్ సమస్య... డాక్టర్లకు ఒక కేస్ స్టడీగా ఉంటుంది. దిసీజ్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. దీన్ని పవన్ అభిమానులు కూడా తెలుసుకోవాలి. రెండు విడతలు కాదు.. రెండు ప్యాకేజీలు: రెండు విడతలుగా చేసిన వారాహి విజయయాత్రను వారు నిన్న ముగించారు. దాన్ని నేను కొద్దిగా మార్చి చెబుతాను. ‘రెండు ప్యాకేజీలుగా ఉన్నటువంటి వరాహం, ప్యాకేజీ యాత్రను నిన్న దిగ్విజయంగా ముగించినటువంటి పవన్‌కళ్యాణ్‌గారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మీ ద్వారా అందిస్తున్నాను’. యాత్రను ఎంత బాగా నిర్వహించారంటే.. మర్యాదలకు మారుపేరైన గోదావరి జిల్లాల్లో ఎంత అమర్యాదగా మాట్లాడారో అందరూ చూశారు. అయ్యా, పవన్‌కళ్యాణ్‌గారు మళ్లీ ఎప్పుడొస్తారో చెప్పండి. లెక్క సెటిల్ కాగానే వస్తారు కదా?: మాకు మిమ్మల్ని చూసి చూసి కాస్త ఉత్సాహం పెరిగిపోయింది కుర్రోళ్లందరికీ.. మీరు వెళ్లిపోతీ టీవీ వాళ్లు కూడా దిగాలు పడతారు. ఔనులే.. మీరు రావాలంటే మీకో లెక్క ఉంది. ఆ లెక్క లేనిదే మీరు రారు. ఆ లెక్కను మేము డిసైడ్ చేయలేం. సొరంగ మార్గం తవ్వుతున్న నాదెండ్ల మనోహర్‌గారు తెలుగుదేశం పార్టీకి వెళ్లి, ఆ లెక్క సెటిల్ చేస్తే.. అప్పుడు మీరొస్తారు. మళ్లీ మమ్మల్ని ఎంటర్‌టెయిన్ చేస్తారు. ఇక నుంచి మిమ్మల్ని "ఏకపత్నీవ్రతుడు" అనే పిలుస్తాం. సంతోషంగా వెళ్లి రండి. లాభంగా వెళ్లారు కదా? మళ్లీ లాభంతో రండి. లెక్క చూసుకుని రండి. ఏం మాట్లాడుతున్నావయ్యా.. నీవొక రాజకీయనాయకుడివా? 1000సార్లు జగన్నామస్మరణ చేయండి: నేను ఇక నుంచి జగన్‌గారిని ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ అన్నాడు. దాంతో మేము బాధ పడ్డామని, ఆయన బాధ పడిపోతున్నాడు. పవన్, ఆ శపథం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 373 సార్లు జగన్‌గారిని ఏకవచనంతో సంబోధించాడు. అయ్యా, 1000 సార్లు అలా జగన్‌గారి పేరు ఉచ్ఛరించండి. మీరు చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి. ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఏకంగా రూ. 2.25 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి పేదల ఖాతాల్లో జమ చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆదుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తున్నారు. అందుకే జగన్‌గారి పేరును మీరు 1000 సార్లు స్మరించండి. మీకు పాప పరిహారం అవుతుంది. మీరు సినీ, రాజకీయ రంగంలో చేసిన తప్పిదాలను దేవుడు క్షమిస్తాడు. హిందూ ధర్మరక్షకుడంట!: ఇంకా.. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? నిన్న తణుకులో మాట్లాడింది ఎవరో తెలుసా? పవిత్రమైన దీపారాధనను సిగరెట్ ముట్టించుకోవడానికి ఉపయోగించుకున్న ఒక కానిస్టేబుల్ కొడుకు. ఇకనైనా అందరూ వినండయ్యా. ఆ పెద్దమనిషి వ్యవహారాన్ని. హిందూ ధర్మం ప్రకారం ఎన్ని పెళ్ళిళ్లు చేసుకోవచ్చో మాకు తెలియదు. మీరైనా చెప్పండి అతనికి. ఇటువంటి పవన్ కల్యాణ్ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాడా..? వారిపై ఎందుకంత కడుపు మంట?: వలంటీర్ల వ్యవస్థ మీదు ఎందుకంత కడుపు మంట? వారు ఇతర ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి రాలేదు కదా? ఆ 50 ఇళ్లలో నుంచి వచ్చిన వారే కదా? ఆ ప్రాంతాల్లో, ఆ కాలనీల్లో అక్కా, అన్నా.. అంటూ వరసలు పెట్టి పిల్చుకునే వారే కదా. రోజూ కలుసుకునే వారు. అలాంటి వారిపై ఒక ఏకపత్నీవ్రతుడు. మరో ముసలాయన పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. వారు గౌరవ వేతనం రూ. 5 వేల మాత్రమే తీసుకుని ఎంతో సేవ చేస్తున్నారు. మీకు నిజంగా వారి పట్ల చిత్తశుద్ధి ఉంటే.. మీరు వస్తే వారికి లక్ష జీతం ఇస్తామని చెప్పండి. లేదా వారిని తీసేస్తామని చెప్పండి.. అని మంత్రి శ్రీ అంబటి రాంబాబు అన్నారు.