గిరిజనులకు ఎవరూ చేయని మేలు వైయ‌స్‌ జగన్‌ చేశారు

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

విజయవాడ: గిరిజనులకు దేశంలో ఎవరూ చేయని మేలు వైయ‌స్‌ జగన్‌ చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. , గిరిజనుల కోసం మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను చంద్రబాబు.. ఐదేళ్లు మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు. గిరిజ‌నుల‌కు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌ది. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీ, 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం.గిరిజనులకు ఏనాడైనా చంద్రబాబు ఇన్ని పథకాలు తెచ్చారా?. జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.

Back to Top