సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం

మంత్రి పినిపే విశ్వ‌రూప్‌

అల్ల‌వ‌రం మండలంలో సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి

అమ‌లాపురం:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌ల‌తో గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ‌ స్వ‌రాజ్యం సాధ్య‌మ‌వుతుంద‌ని మంత్రి పినిపే విశ్వ‌రూప్ పేర్కొన్నారు. అల్లవరం మండలం, మొగళ్లమూరులోని గోగివారిపేటలో 30 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, ఎమ్మెల్సీ  బొమ్మి ఇజ్రాయిల్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు సరికదా సరైన సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు కాదు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి గ్రామలోనూ పదిమందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు.

నగరాలతో సమానంగా మారుమూల కుగ్రామాల్లో సైతం 543 రకాలకు పైగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చి జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం స్థాపన దిశగా పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఏ పనినైనా సొంత గ్రామంలోనే పూర్తిచేసుకునే సౌలభ్యం కల్పించారు. దీనికి తోడు ప్రాధాన్యత క్రమంలో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.  పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు.

పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు చెల్లింపులకు వీలుగా ఆర్థిక స్వాతంత్య్రం కల్పించార‌ని మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో రుణాలు మాఫీచేసిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి మ‌హిళ‌లు అండ‌గా నిల‌వాల‌ని కోరారు.  మహిళలకు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం కల్పించింది జగనన్నేనని స్పష్టం చేశారు.  ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా మహిళల ఆర్థిక సాధికారతకు కృషిచేసిన జగనన్నవెంటే మహిళాలోకం ఉంటుందని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top