కరోనా కంటే చంద్రబాబు అత్యంత ప్రమాదకారి

మంత్రి పేర్ని నాని

చంద్రబాబు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు

ఎన్‌440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణ జరగలేదు

దేశంలో బి.1.617 మినహా కొత్తరకం వైరస్‌ ఎక్కడా లేదు

కరోనా కట్టడికి శక్తికి మించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోంది

అవసరమైన ప్రతి పేషెంట్‌కు రెమిడెసివివర్‌ అందుబాటులో ఉంది

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

తాడేపల్లి:  కరోనా కంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. శక్తికి మించి కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తుందని, చంద్రబాబు పక్క రాష్ట్రంలో దాక్కొని తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌ కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్‌ లేదని, ఎన్‌440 వైరస్‌ అంటూ చంద్రబాబు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడారు.

తెలుగు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా నాలుగు మంచి సలహాలు ఇవ్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు తన బుద్ధి మార్చుకోవడం లేదు. కుక్క తోక వంకర అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉంది. ప్రతిపక్ష నేత పక్క రాష్ట్రంలో దాక్కున్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడటం విచారకరం. ఎంతో మంది ప్రజలను బలికొంటున్న కరోనా మహమ్మారి కంటే కూడా అత్యంత ప్రమాదకరం. చంద్రబాబు నైజం బయటపడుతోంది, దిగజారుడు రాజకీయాల కోసం ప్రజల్లో అభిమానాన్ని నిలుపుకున్న సీఎం వైయస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం  శక్తికి మించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నా కూడా తన కొడుకు భవిష్యత్‌ కోసం ప్రజల మంచిని పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి  సమయంలో కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం ఇంతకన్నా రాజకీయాల్లో దిగజారుడు, నీచమాలిన చర్యలు ఎక్కడా ఉండవు.

రాష్ట్రం గురించి పరాయి రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉంటూ ఆరోపణలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఎన్‌ 440 కే  వైరస్‌ అంటూ నీచ ఆరోపణలు చేస్తున్నారు. ఆ నింద వాస్తవం అయితే ఎవరికి భాధ లేదు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడంటే ..ఇవాళ రాకేష్‌కుమార్‌ ఈ వైరస్‌ రాష్ట్రంలో లేదని చెబితే.. చంద్రబాబు రాజగురువు రామోజీ రావు తన పేపర్‌లోనే రాశారు. ఈ వైరస్‌ గురించి ఎలాంటి నిర్ధారణ జరగలేదని చెప్పారు. 
వైద్య నిపుణుడు వేణుస్వరూప్‌ కూడా ఢిల్లీ నుంచి చెప్పారు. దేశంలో బి.1.617 మినహా కొత్తరకం వైరస్‌ ఎక్కడా లేదు. కేరళ, పాండిచెరిలో ఉందని చెప్పారు. ఇవాళ ఈ వైరస్‌ రాష్ట్రంలో లేదు. ఎవరైనా ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ప్రతిపక్ష నేతగా ఖండించాల్సింది పోయి ఆయనే దిగజారి మాట్లాడటం సరికాదు.

ఎందుకీ రాష్ట్రంపై చంద్రబాబుకు కక్ష. ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు ఎందుకు. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి తన కొడుకు రాజకీయ భవిష్యత్‌ కోసం కక్షగట్టి మాట్లాడవచ్చా?
వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి ఏమీ లేకపోవడంతో హీనంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. మీరు అ«ధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా వైరాలజీ ల్యాబ్‌ లేదు. ఇవాళ రాష్ట్రంలోఒ 14 వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. అత్యధికంగా కరోనా పరక్షలు చేశాం. 85.6 శాతం రికవరీ రేటు మన రాష్ట్రంలోఒ ఉంది. మన రాష్ట్రంలో రెమిడెసివర్‌ అవసమైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం. 44542 బెడ్లకు రెమిడెసివర్‌ అందజేస్తున్నాం. కరోనా గురించి ప్రతి రోజు సీఎం వైయస్‌ జగన్‌  రివ్యూ చేస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు, ఆక్సిజన్‌ ఇచ్చేది ఎవరో చంద్రబాబుకు తెలియదా?. సింగపూర్‌ నుంచి ఆక్సిజన్‌ తెప్పించారు.

దేశంలోనే చిన్న వయసు ఉన్న వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి ఆదర్శంగా పాలిస్తున్నారని పక్క రాష్ట్రాల నేతలు కొనియాడుతున్నారు. ఇవాళ వ్యాక్సిన్‌గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు వ్యాక్సీన్‌ నియంత్రణ కేంద్రం చేతిలో ఉంటుందని తెలియదా? దేశంలోనే  అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా రోజుకు 6 లక్షలకు పైబడి వ్యాక్సిన్‌ వేశాం. కేంద్రం సమృద్ధిగా వ్యాక్సిన్‌ అందిస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసే సామర్థ్యం ఏపీకి ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

 

Back to Top