టీడీపీ నేతలు మాస్క్‌లు ఎందుకు వేసుకోలేదు?

టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

నారా లోకేష్‌ను ఎంపీటీసీగా పోటీ చేయిస్తావా? 

చంద్రబాబుకు మంత్రి  పేర్నినాని సవాల్‌

అమరావతి: కరోనా ప్రభావముంటే నామినేషన్‌ సమయంలో టీడీపీ నేతలు ఎందుకు మాస్క్‌లు ధరించలేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో టెంట్లు వేసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు మాస్క్‌లు వేసుకొని నామినేషన్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. గవర్నర్, డీజీపీ, సీఎస్ కుర్చీలకు విలువ లేకుండా చేసిందీ టీడీపీ అధినేత చంద్రబాబేనని చెప్పారు. ఎస్‌ఈసీ రమేష్‌ ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. నాయకత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు.. టీడీపీ తోక పార్టీలుగా మారొద్దని సూచించారు. వైయస్ఆర్‌సీపీ పాలన బాగోలేదంటున్న చంద్రబాబు.. నారా లోకేష్‌ను ఎంపీటీసీగా పోటీ చేయించాలని పేర్ని నాని సవాల్ విసిరారు.

Back to Top