పవన్‌ స్క్రిప్ట్‌ అంతా చంద్రబాబుదే

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

విజయవాడ: పవన్‌ స్క్రిప్ట్‌ అంతా చంద్రబాబుదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పవన్‌ ఆలోచన, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలని పవన్‌ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కుప్పం సభలో జనాలే లేరన్నారు. నేర చరిత్ర చంద్రబాబుకే ఉందని, టీడీపీలో గుండాలు ఉన్నారని పేర్కొన్నారు. పంచభూతాల సాక్షిగా అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు.
 

Back to Top