సురక్షమైన ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

జాతీయ విద్యుత్‌ భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

జులై 4న విజయ డెయిరీని సీఎం వైయస్‌ జగన్‌ జాతీకి అంకితం

షుగర్‌ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం రూ.32 కోట్ల బకాయిలను త్వరలోనే చెల్లిస్తాం

తిరుపతి: సురక్షమైన ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జాతీయ విద్యుత్‌ భద్రతా వారోత్సవాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారరెడ్డి ప్రారంభించారు. విద్యుత్‌ భద్రతా వారోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నామన్నారు. రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా అందిస్తున్నామన్నారు.  భద్రతా సూత్రాలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారిస్తున్నామన్నారు. జూన్‌ నెలలో కూడా విద్యుత్‌ వినియోగం పెరిగిందని వివరించారు. పెరిగిన డిమాండుకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో విద్యుత్‌ అందిస్తున్నామన్నారు.

 సురక్షమైన ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని చెప్పారు. సబ్‌ స్టేషన్ల వారీగా సలహా కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయ నిబంధనలు అనుసరించి విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

షుగర్‌ ఫ్యాక్టరీ సమర్ధవంతంగా నిర్వహించలేనప్పుడు  ఆ స్థానంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ హామీ మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం రూ.32 కోట్ల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. 

చిత్తూరు విజయ డెయిరీకి రూ.12 కోట్ల బకాయిలను త్వరలో చెల్లిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. జులై 4న విజయ డెయిరీని సీఎం వైయస్‌ జగన్‌ జాతీకి అంకితం చేస్తారని మంత్రి చెప్పారు. అమూల్‌ సంస్థకు విజయ డెయిరీని అప్పగించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. అమూల్‌ రాకతో చిత్తూరు జిల్లాతో పాటు పక్క జిల్లా పాడి రైతులకు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
 

Back to Top