చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్‌ 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 చిత్తూరు: చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్ న‌డుస్తున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. విశాఖ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు పాలనలో పోలీసులను హీనంగా చూశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు సీఎం వైయ‌స్ జగన్ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు అరాచక పాలన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్ న‌టిస్తున్నార‌ని ధ్వజమెత్తారు. విశాఖ గర్జన సూపర్ సక్సెస్ కావడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుంది. మూడు రాజధానులకు అన్ని ప్రాంతాల వాసులు మద్దతు తెలుపుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top