ఆరు రోజుల్లో పరిషత్‌ ఎన్నికలు నిర్వహించవచ్చు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మున్సిపాలిటీలో ఇద్దరు వైస్‌ చైర్మన్లు

కార్పొరేషన్‌లో ఇద్దరు ౖడిప్యూటీ మేయర్ల నియామకం కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌

సచివాలయం: హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలకు అడ్డు తొలగిపోయిందని, న్యాయపరమైన అవరోధాలన్నీ తొలగిపోయాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆరు రోజుల్లో  నిర్వహించ వచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇద్దరు వైస్‌ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను నియమించేందుకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఆర్డినెన్స్‌ రూపొందించారని, గవర్నర్‌ ఆమోదం పొందిన వెంటనే నియామకాలు చేపడుతామని మంత్రి తెలిపారు. మంగళవారం సచివాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎస్‌ఈసీ వంటి సంస్థలకు పరిమితితో కూడిన కొన్ని అధికారాలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలే కానీ, అతిక్రమించకూడదు. కరోనా కారణంగా పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌..ఆ తరువాత ఎక్కడ నుంచి నిలిపివేశామో అక్కడి నుంచి మొదలుపెడుతామని కోర్టుకు చెప్పారు. దానికి విరుద్ధంగా ముందుగా సర్పంచ్‌ ఎన్నికలు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీసేలా, టీడీపీకి మేలు చేసేలా ఎస్‌ఈసీ వ్యవహరించారు. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. ఈ రోజు ఎన్నికలు పూర్తి చేసేందుకు ఏ అడ్డంకులు లేవు.

 

ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయవచ్చు. తప్పకుండా కమిషనర్‌ ఎన్నికలు నిర్వహించాలి. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డనే నిర్వహించారు కాబట్టి..ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి రిటైర్డు అయితే బాగుంటుంది. తొందరగా ఎన్నికలు ముగిస్తే..ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తుంది. ఇప్పటికే పోలీసులు, అధికారులు ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ఆరు రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే మేయర్, మున్సిపల్‌ చైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని, మా ప్రభుత్వం  మేయర్, చైర్మన్లతో పాటు ఒక్కో కార్పొరేషన్‌కు ఇద్దరు వైస్‌ మేయర్లు, ఒక్కో మున్సిపాలిటీకి ఇద్దరు వైస్‌ చైర్మన్లను నియమించాలని ఒక ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపిస్తామన్నారు. గవర్నర్‌ ఆమోదం లభించిన వెంటనే వైస్‌ మేయర్లు, వైస్‌ చైర్మన్లను ఎంపిక చేస్తామన్నారు. ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజలకు నేరుగా అందించాలని,జవాబుదారీతనం ఎక్కువగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 
 

Back to Top