రీ టెండరింగ్‌ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జల్‌ జీవన్‌ మిషన్‌ సదస్సుకు హాజరైన మంత్రి  

న్యూఢిల్లీ: రీ టెండరింగ్‌ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 పేర్కొన్నారు.  త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జల్‌ జీవన్‌ మిషన్‌ సదస్సుకు ఏపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని మంత్రి  తెలిపారు. ఏపీకి రావాలని కేంద్ర జలశక్తి మంత్రిని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ ఆహ్వానించారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పోలవరం పనులను పరిశీలిస్తారని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరందించేందుకు ప్రాజెక్టుకు సెప్టెంబర్‌లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.రూ.60 వేల కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.30 వేల కోట్ల ఆర్థికసాయం కోరామని పెద్దిరెడ్డి వివరించారు.

Back to Top