మద్యం దుకాణాల రెంట్‌పై రూ.108 కోట్లు ఆదా

సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో షాపుల రెంట్‌పై రివర్స్‌టెండరింగ్‌

గతేడాది కంటే 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశాం

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

అమరావతి: మద్యం దుకాణాల రెంట్‌పై రూ.108 కోట్లు ఆదా చేశామని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. మద్యం షాపుల రెంట్లపై రివర్స్‌టెండరింగ్‌ ద్వారా గతేడాది రెంట్లతోపోల్చితే రూ.108 కోట్లు ఆదా చేశామని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో దుకాణాల రెంట్లపై రివర్స్‌టెండరింగ్‌ నిర్వహించామన్నారు. గతంలో మద్యం షాపులు రెంటుకు తీసుకున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. సీఎం ఆదేశాలతో మద్యం దుకాణాల రెంటుపై రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.108 కోట్లు ఆదా చేశామన్నారు. 2019–20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించామని చెప్పారు. అదే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 2020–21 ఏడాది కేవలం రూ.562.2 కోట్లు మాత్రమే చెల్లించామని తెలిపారు. అంటే దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశామన్నారు.  
 

Back to Top