జనరంజక పాలన చూసి తట్టుకోలేకపోతున్నారు

శుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ప్రతిపక్షనేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. తొలి ఏడాది పాలనలోనే సీ–ఓటర్‌ సర్వేలో దేశంలోనే నాల్గవ స్థానాన్ని సీఎం వైయస్‌ జగన్‌ దక్కించుకున్నారన్నారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాల వల్లే టీడీపీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్, బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని పార్కు హయత్‌ హోటల్‌లో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం మొదటి నుంచి వివాదస్పదంగానే ఉందన్నారు. 
 

Back to Top