మండలిని టీడీపీ ఆఫీస్‌గా మార్చేశారు

చంద్రబాబు కనుసన్నల్లోనే కౌన్సిల్‌ చైర్మన్‌ యాక్టింగ్‌ జరిగింది

రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నడూ జరగలేదు

ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు కోసమే వికేంద్రీకరణ బిల్లులు

పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

 

అసెంబ్లీ: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చారని పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రధానమైన బిల్లులకు మండలి అడ్డుపడడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని, కౌన్సిల్‌ చట్టాలు చేసే సభ కాదన్నారు. మండలిని రాజకీయ పునరావాస శిబిరంగా చంద్రబాబు తయారు చేశాడన్నారు. అలాంటి  కౌన్సిల్‌ ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే కాబట్టి ఆ వ్యవస్థ నడవాలా.. వద్దా అనేది ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని కోరారు.

అసెంబ్లీలో మంత్రి మోపిదేవి వెంకట రమణ ఏం మాట్లారంటే.. ‘గడిచిన నాలుగు రోజుల నుంచి రాష్ట్ర భవిష్యత్తు, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు తొలగిపోవాలని, మారుమూల గ్రామం కూడా అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఎంతో మంది సభ్యులు అమూల్యమైన సలహాలు చేయడం, మెజార్టీ ప్రజలు వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఉపయోగపడే ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా.. చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టే రెండు ప్రధానమైన బిల్లులను శాసనసభలో ఆమోదించి పెద్దల సభకు పంపించడం జరిగింది. చట్టసభలో ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలను పెద్దల సభలో చర్చించి ప్రజలకు ఇంకా ఉపయోగపడే విధంగా మేలైన ప్రయోజనాలు కలిగే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడం పెద్దల సభ పని. అలాంటి ప్రధానమైన సభలో రాష్ట్ర భవిష్యత్తుకు ముడిపడి ఉన్న బిల్లులు రెండు వెళ్లినప్పుడు సమాజం సిగ్గుపడేలా అవహేళనగా రెండు రోజుల పాటు కౌన్సిల్‌లో జరిగిన పరిస్థితులు, చైర్మన్‌ ప్రవర్తన ఇబ్బందికరం కల్పించింది.

బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం రెండు బిల్లులు ప్రపోజ్‌ చేసినప్పుడు అప్పటికప్పుడు రూల్‌ 71 తీసుకువచ్చి ముందు దానిపై చర్చ జరగాలి.. తరువాత బిల్స్‌పై చర్చ జరగాలని రోజంతా సమయాన్ని వృథా చేశారు. మంత్రులు ఎంత మంది చర్చకు పట్టుబట్టినా రూల్‌ 71 మీద చర్చ జరిగిన తరువాత బిల్స్‌పై కూడా చర్చ చేద్దామని ఇష్టం లేకుండానే మండలి చైర్మన్‌ ఒప్పుకున్నారు. బిల్స్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శనాత్మకంగా చర్చ జరిపి దానిపై లాస్టు ఓటింగ్‌ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరుసటి రోజు బిల్లుకు సంబంధించి చర్చ మొదలైనప్పటికీ ముగింపులో సెలెక్టు కమిటీ అనే నిబంధన తీసుకువచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూల్స్‌ అతిక్రమిస్తున్నాను. విచక్షణాధికారంతో సెలెక్ట్‌ కమిటీకి రెఫర్‌ చేస్తున్నానని చైర్మన్‌ ప్రకటించారు. ఓటింగ్‌ పెట్టకుండా సెలెక్ట్‌ కమిటీకి పంపించడం చాలా దారుణం. మండలిలో జరిగిన పరిస్థితులు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా కొంతమంది పెద్దలు అక్కడకు వచ్చి డైరెక్ట్‌గా చైర్మన్‌ను ప్రభావితం చేశారు. సెక్యూరిటీ గార్డుల్లా కూర్చొని ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. పెద్దల సభలో రాజకీయ పరమైన కోణంలో టీడీపీ ఆఫీస్‌లా తయారు చేశారు. ఆంధ్రరాష్ట్ర రాజకీయ చరిత్రలో నిన్నటి లాంటి దురదృష్టకరమైన పరిణామాలు ఏనాడూ ఎదురుకాలేదు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని టీడీపీ కల్పించింది.

గ్యాలరీ నుంచి చైర్మన్‌ను డిక్టేట్‌ చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే చైర్మన్‌ యాక్టింగ్‌ చేశారు. చైర్మన్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా ప్రవర్తించడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రధానమైన బిల్లులకు మండలి ఈ మధ్యకాలంలో అడ్డుపడడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కౌన్సిల్‌ చట్టాలు చేసే సభ కాదు. రాజకీయ పునరావాస శిబిరంగా ఉన్న కౌన్సిల్‌ ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే కాబట్టి ఆ వ్యవస్థ నడవాలా.. వద్దా అనేది ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని, ప్రజలకు ఉపయోగపడే బిల్లులను భవిష్యత్తులో మళ్లీ అడ్డుకుంటారని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పునరాలోచన చేయాలని కోరారు. అదే విధంగా టీవీ డిబేట్లలో కూర్చొని మంత్రులను, ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడి ఏదో గొప్పగా ఫీలవుతున్నారని, అలాంటి వాటిని కూడా కట్టడి చేయాలని స్పీకర్‌ను కోరారు.

తాజా వీడియోలు

Back to Top