నీతో చర్చకు నేను సిద్ధం చంద్రబాబూ..

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

దళితులకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రా..

ఎవరు దళిత ద్రోహి..ఎవరు దళిత బాంధవుడో తేల్చుకుందాం

టైం, ప్లేస్‌ చెప్పు...నేను ఒక్కడ్నే వస్తా*: మంత్రి  మేరుగు నాగార్జున

దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని నువ్వు అనలేదా...?

నీ కొడుకు దళితులు ఏం పీకుతారు అనలేదా..?

వీటన్నిటిపై చర్చించేందుకు నేను సిద్ధం

రాజకీయాల్లో నువ్వుండాలంటే మాతో చర్చించు

బాబుకు జగన్‌ గారి గురించి, దళితుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదు

 మంత్రి మేరుగు నాగార్జున

తాడేప‌ల్లి: నీతో చర్చకు నేను సిద్ధం చంద్రబాబూ..అంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స‌వాలు విసిరారు. దళితులకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రా..ఎవరు దళిత ద్రోహి..ఎవరు దళిత బాంధవుడో తేల్చుకుందాం..టైం, ప్లేస్‌ చెప్పు...నేను ఒక్కడ్నే వస్తాన‌ని  మంత్రి  మేరుగు నాగార్జున చాలెంజ్ చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

మంత్రి మేరుగు నాగార్జున ఏమ‌న్నారంటే..

మా బిడ్డల ఇంగ్లీషు మీడియం విద్యపై చర్చకు సిద్ధమా..?
పేదవారి ఆరోగ్య భద్రతపై చర్చకు సిద్ధమా..?
31 లక్షల ఇళ్ల స్థలాల్లో సింహభాగం మా దళితులకే
రాష్ట్రంలో రూ. 2.08 లక్షల కోట్లు డీబీటీలో ఎస్సీలకే అగ్రతాంబూలం
అంబేద్కర్‌ విగ్రహం పెట్టలేక పారిపోయిన పిరికిపంద చంద్రబాబు
విజయవాడ నడిబొడ్డున రూ.300 కోట్లతో విగ్రహం పెడుతున్న ధీరుడు సీఎం వైయ‌స్ జగన్ 
దళిత మంత్రి సురేష్‌పై దగ్గరుండి రాళ్లేయించింది చంద్రబాబే
వైయ‌స్ జగన్‌ గారిపై ప్రజలకున్న విశ్వాసాన్ని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు
చంద్రబాబు అనే క్షుద్ర రాక్షసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు
చంద్రబాబునాయుడుకి అకస్మాత్తుగా దళితులపై ఎక్కడలేని ప్రేమ వచ్చింది
ఆయన అవసరం ఉన్నప్పుడు దళితుల కాళ్లు పట్టుకుంటాడు...అవసరం తీరాక మోకాలితో తంతాడు
వైయ‌స్‌ జగన్‌ గారు దళిత ద్రోహి అని, దానిపై చర్చకు తాను సిద్ధమని చంద్రబాబు సవాల్‌ విసిరాడు
నేను చంద్రబాబును సూటిగా అడుగుతున్నా..చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను
 నేను సంబంధిత మంత్రిని..దళితుడను కూడా..ఒక్క చంద్రబాబుతోనే చర్చకు సిద్ధంగా ఉన్నా...
దళితుల విషయంలో ఎవరు ఎక్కువ సాయం చేశారో తేల్చుకుందాం రా

టైం, ప్లేస్‌ చెప్పు...నేను ఒక్కడ్నే వస్తా...

- నీ హయాంలో దళితులపై జరిగిన దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలపై, వారి భూములను 
లాక్కున్న తీరుపై చర్చకు సిద్ధం
- దళిత మహిళలను వివస్త్రను చేసిన అంశాలపై చర్చిద్దాం

నీ హయాంలో దళితులపై దాడుల్లో ఏపీ ప్రథమంగా ఉందని ఎన్‌సీఆర్బీ ఇచ్చిన నివేదికపై చర్చిద్దాం

దళిత బాంధవుడు వైయ‌స్‌ జగన్‌:

- వైయ‌స్ జగన్‌ గారు రాష్ట్రంలో దళితులకు ఏ విధంగా సాయం చేస్తున్నారో అనే అంశంపై కూడా చర్చకు సిద్ధం
- చంద్రబాబు స్పష్టంగా తాను దళితులకు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడు
- అంబేద్కర్‌ విద్యే ఆయుధం అని చెప్పిన మాటల్ని జగన్‌గారు విద్యలో సమూల మార్పులు తెస్తూ నిజం 
చేస్తున్నారు
- మా పల్లెల్లో స్కూళ్లు బాగుపడ్డాయి..మా పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు
- మా పిల్లలు సీబీఎస్‌ఈ సిలబస్‌ చదువుతున్నారు..అనర్ఘలంగా ఇంగ్లీషు మాట్లాడుతున్నారు
- 8వ తరగతిలో ట్యాబ్‌ ద్వారా ప్రపంచాన్ని చదివే ఆవకాశం కల్పించారు
- ఇలాంటి అవకాశాలు మందు ఎన్నడన్నా ఉన్నాయా..?
- నువ్వున్నప్పుడు వైఎస్సార్‌ పెట్టిన ఆరోగ్యశ్రీలోని సగం రోగాలు తీసేశావు
- పేదవారి కోసం ఆరోగ్య భద్రత కల్పించిన అంశంపై చర్చకు సిద్ధమా..?
- రాష్ట్రంలో 31లక్షల మందికి ఇళ్లు ఇస్తుంటే..దానిలో మెజార్టీ ఎస్సీలే ఉన్నారు
- చంద్రబాబు హయాంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు కూడా ఇవ్వని దుస్థితి
- రాష్ట్రంలో సామాజిక విప్లవానికి జగన్మోహన్‌రెడ్డి గారు తెరతీశారు
- ఉప ముఖ్యమంత్రుల నుంచి చివరికి ఆలయాల ట్రస్టు బోర్డుల్లో ఎస్సీల నియామకం వరకూ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం

అంబేద్కర్‌ విగ్రహం పెట్టలేక పారిపోయిన పిరికి పంద చంద్రబాబు:
- అంబేద్కర్‌ విగ్రహం పెట్టలేక చంద్రబాబు పిరికిపందలా పారిపోయాడు
- మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ విజయవాడ నడిబొడ్డున రూ.300 కోట్లతో విగ్రహం పెడుతున్నారు
- రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నది నువ్వే కదా బాబూ
- ఈ రోజు రాజధాని కాదు..రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తున్న తీరుపై చర్చకు సిద్ధం
- రాష్ట్రంలో రూ. 2.08 లక్షల కోట్లు డీబీటీ పేదలకు పంచితే దానిలో ఎస్సీలకు అగ్రతాంబూలం వేశారు
- నీ ఐదేళ్లలో దళితుల కోసం రూ.33 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మా నాయకుడు రూ.53లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాడు
- ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన మా జగన్‌ గారు దళిత బాంధవుడు 
- మాపై ఎన్నో అరాచకాలు చేసిన చంద్రబాబు దళిత ద్రోహి

చర్చించలేకపోతే రాజకీయ సన్యాసం:
- చంద్రబాబు నువ్వు ఎప్పుడు, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తా
- నేను నీతో చర్చించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా
- మా నాయకుడి పాదాల వద్ద రాజీనామా లేఖ పెట్టి వైఎస్సార్‌ సమాధి వద్ద కాపలా కాసుకుంటూ బతుకుతా
- నీకు దమ్ముందా చంద్రబాబు...నేను దేనికైనా సిద్ధం
- ఉడత ఊపులకు చింతకాయలు రాలవు..
- దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని నువ్వు అనేలేదా...?
- నీ కొడుకు దళితులు ఏం పీకుతారు అని అనలేదా..?
- దళితులు మురికి వాళ్లని నీ మంత్రులు అనలేదా..?
- మీకెందుకురా రాజకీయాలు అని నీ ఎమ్మెల్యే చింతమనేని అన్నాడు.
- వీటన్నిటిపై చర్చించేందుకు నేను సిద్ధం

దళిత మంత్రిపై దగ్గరుండి రాళ్లేయించింది చంద్రబాబే:
- దళితుడైన మంత్రి ఆదిమూలపు సురేష్ పై దగ్గరుండి రాళ్లేయించిన నువ్వే మళ్లీ దారుణంగా మాట్లాడుతున్నాడు
- రాజకీయాల్లో నువ్వుండాలంటే...మాతో చర్చించి, నీ ఆరోపణలు నిరూపించి మాట్లాడు
- మా నాయకుడి గురించి మాట్లాడాలంటే ముందు నువ్వు కోరినట్లు చర్చ చేసి మాట్లాడు
- చంద్రబాబు కోసం కొందరు ఎస్సీ నేతలు డూడూ బసవన్నలుగా మారారు..వాళ్లంతా చంద్రబాబు చేతిలో మోసపోయిన వారే
- వర్ల రామయ్య వారధి వరకూ వచ్చి పదవి రాలేదని ఏడ్చిన వ్యక్తి
- వాళ్లు నిజంగా దళితులైతే చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్నప్పుడే ముఖాన కాగితం కొట్టి బయటకు రావాలి
- అలా రాని వ్యక్తులు మాట్లాడే మాటలకు ఇక విలువేముంటుంది..?
- చంద్రబాబుకు జగన్‌ గారి గురించి, దళితుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదు.

నీ హయాంలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమా..?:
- చంద్రబాబు విదేశీ విద్యకు అంబేద్కర్‌గారి పేరు పెట్టారు..నిజమే..కానీ దాన్ని మధ్యలోనే ఆయన వదిలేశాడు కదా
- దానిలో అనేక అవతవకలు జరిగాయని విజిలెన్స్‌ విచారణ కూడా జరిగింది
- జగన్‌ గారు పెట్టిన విదేశీ విద్యలో ఒక్కొక్కరికి రూ.1.25 కోట్లు ఇస్తున్నాడు 
- చంద్రబాబు ఆనాడు ఇచ్చింది కేవలం రూ.10 లక్షలు మాత్రమే
- 24 స్కీంలు పెట్టామని చెప్పుకుంటున్నారు కదా..వాటిపై కూడా చర్చకు సిద్ధమా..?
- ఆ స్కీంలలో ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత గుత్తాధిపత్యం జరిగిందో చెప్పడానికి నేను సిద్ధం
- మా నాయకుడు పెట్టిన స్కీంలలో ఒక్క పైసా అవినీతి ఉంటే చంద్రబాబు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు
- కానీ చంద్రబాబు అవినీతి అని మాత్రం ఒక్క చోట కూడా మాట్లాడలేకపోతున్నాడు
- చంద్రబాబుతోనే చర్చకు సిద్ధం...ఇంకెవరు వచ్చినా కుదరదు
- రాష్ట్రంలో జగన్‌ గారిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు
- చంద్రబాబుకు ప్రజలు 14 ఏళ్లు అధికారం ఇచ్చారు..అప్పుడు చేయలేని వాడు ఇప్పుడేం చేస్తాడు..?
- ఇంటికో ఉద్యోగం..లేదంటే 2వేల భృతి ఇస్తానన్నాడు
- చివరికి మేనిఫెస్టోనే తీసేశాడు..అప్పటి ప్రకటనలు ఇప్పుడు కనిపించవు..
- మళ్లీ ఇప్పుడు బాబొస్తే జాబొస్తుంది అంటే ఎవరు నమ్మరు
- చంద్రబాబు అనే క్షుద్ర రాక్షసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు.

Back to Top