అమరావతి: దేశ చరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డన, ఖరీదైన స్థలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెప్పారు. మంత్రి ఏమన్నారంటే..డాక్టర్ బాబాసాహేబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఎందుకు పెట్టాల్సి వచ్చిందో. ఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాల్సి వచ్చిందో ఎమ్మెల్యే జోగారావు విపులంగా చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనుకుంది. 125 అడుగుల విగ్రహాన్ని రూ.100 కోట్లతో పెడతానని చంద్రబాబు చెప్పారు. వాళ్లకు అంబేద్కర్‌పై ఎంత గౌరవం, ప్రేమ ఉందో అని అనుకున్నాం. నిఘుడంగా మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకూడదని వారి మనుసులో ఉంది. ఈ అసెంబ్లీలోనే ముళ్ల పొదల్లో పెట్టాలనుకున్నారు. మా నాయకుడు అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మమ్మల్ని వెళ్లి చూసి రమ్మని పంపించారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతానికి వెళ్తే తనను అరెస్టు చేయించారు.ఎందుకు అరెస్టు చేయించారో చెప్పలేకపోయారు. అదృష్టం కొద్ది వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేస్తారని అనుకున్నాం. మేం అనుకోని విధంగా విజయవాడ నడిబొడ్డున, ఖరీదైన స్థలంలో, యోధానుయోధులు ఉండే ప్రాంతం నడిబొడ్డున 18 ఎకరాలన్నర స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రూ.260 కోట్లు మంజూరు చేశారు. దానికి అదనంగా మరో రూ.106 కోట్లు ఇచ్చేందుకు అప్రూవల్ ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా రూ.6 కోట్లు ఇస్తున్నారు.దాదాపు రూ.400 కోట్లకు పైగా నిధులతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ అంటే సింబల్ ఆఫ్ సోషల్ జెస్టీస్. రాబోయే తరాలు ఈ మహా నాయకుడిని చూసుకోవాలని సీఎం వైయస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం. ఏప్రిల్ 14కు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ముందుగా అనుకున్నాం. నిరంతరం పనులు జరుగుతున్నాయి. జులై చివరికల్లా పనులు పూర్తి చేసేందుకు శాయకశ్తుల కృషి చేస్తున్నాం. ఇది చరిత్ర కాబోతోంది. దేశంలోని ఎవరైనా విజయవాడకు వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనసున్న ప్రభుత్వం, వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్ జగన్ ఏర్పాటు చేయించారని చరిత్ర చెప్పుకునేలా విగ్రహ ఏర్పాటు జరుగుతుంది. అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.