నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున‌

గుంటూరు: టీడీపీ నేత న‌క్కా ఆనంద‌బాబు బ‌తుకేంటో ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మ‌ట్టి, ఇసుక‌తో అడ్డగోలుగా దోచుకుతున్నాడ‌ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. గుంటూరులో మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. వేమూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ జగన‌న్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయ‌ని చెప్పారు. మట్టి తవ్వకాలకు సంబంధించి పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు సైతం ఉన్నాయ‌న్నారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించగా.. ప్రజలు త‌గిన గుణ‌పాఠం చెప్పార‌న్నారు. వేమూరు నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్లిన న‌క్కా ఆనంద‌బాబుకు ఇలాంటి పరిస్థితే ఎదుర‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top