త్వరలోనే దొనకొండలో ఇండస్ట్రీయల్‌ హబ్‌

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
 

అమరావతి: ప్రకాశం జిల్లా దొనకొండలో కొత్త ప్రాజెక్టును మా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకురాబోతున్నారని, త్వరలోనే సీఎం ప్రకటిస్తారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రాష్ట్రానికి ఫ్రైడ్‌ అనే ప్రాజెక్టు ఇవ్వాల్సి ఉందన్నారు. దాన్ని పబ్లిక్‌ సెక్టార్‌ (పీపీపీ) ద్వారా చేయాలనుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దొనకొండలో కేవలం 5 వేల ఎకరాలు ఇవ్వమని అyì గిందన్నారు. ఈ స్థలంలో గొప్ప పరిశ్రమిక హబ్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పినట్లు తెలిపారు. 2017లో అప్పటి ఏపీఐఐసీ చైర్మన్‌ కూడా కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా 2400 ఎకరాల వరకే ఇస్తామని చెప్పిందన్నారు. 

 

Back to Top