తాడేపల్లి: ‘వైయస్‌ఆర్ నేతన్న నేస్తం’తో చేనేత కుటుంబాలను ఆదుకొని, వారి జీవితాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషాన్ని నింపారని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ‘వైయస్‌ఆర్ నేతన్న నేస్తం’ రెండవ విడత సాయంలో మిగిలిపోయిన అర్హులు 8,903 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున అందించారు. ఈ మేరకు లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రూ.21.31 కోట్లు విడుదల చేసింది. అనంతరం వర్చువల్ విధానంలో చేనేత కుటుంబాలతో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. మగ్గాలను ఆధునీకరించి మరింత నైపుణ్యవంతమైన నేత ప్రదర్శించాలన్నారు. అర్హులందరికీ సాయం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.