ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మంత్రి మేక‌పాటి అంత్య‌క్రియ‌లు

అంతిమ సంస్కారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

క‌న్నీటి వీడ్కోలు ప‌లికిన కుటుంబ స‌భ్యులు, పార్టీ శ్రేణులు

నెల్లూరు: దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి అంత్య‌క్రియ‌ల్లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు పాల్గొన్నారు. గ‌న్న‌వ‌రం నుంచి ప్ర‌త్యేక విమానంలో క‌డ‌ప చేరుకున్న అనంత‌రం క‌డ‌ప నుంచి హెలికాప్ట‌ర్‌లో ఉద‌య‌గిరిలోని మేక‌పాటి ఇంజినీరింగ్ కాలేజీ (మెరిట్స్‌) ప్రాంగ‌ణానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, సీఎం స‌తీమ‌ణి వైయ‌స్‌ భార‌త‌మ్మ‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి చేరుకున్నారు. మెరిట్స్‌లో మంత్రి మేకపాటి గౌత‌మ్‌రెడ్డి భౌతిక కాయానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు నివాళుల‌ర్పించారు. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి భౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. చివ‌రిచూపు కోసం పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లివ‌చ్చి గౌత‌మ్‌రెడ్డికి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. 

Back to Top