పెట్టుబడులతో వచ్చేవారికి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: వ్యవసాయం, అనుంబంధ రంగాల పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతామన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో ‘వాణిజ్య ఉత్సవ్‌–2021’ రెండో రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు వాణిజ్య ఉత్సవ్‌లో పాల్గొని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎగుమతుల అవకాశాలపై మాట్లాడారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతమైన పాలనలో కోవిడ్‌ సమయంలోనూ ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. 5.8 శాతం ఎగుమతులతో దేశంలోనే ఏపీ 4వ ర్యాంకులో నిలిచిందన్నారు. 2020–21లో పోర్టుల నుంచి 172 మిలియన్‌ టన్నుల ఎగుమతులు జరిగాయన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరుస్తున్నామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top