కాపులం ఏమైనా పవన్ కల్యాణ్‌కు పట్టం కట్టామా..?

అమరావతి ల్యాండ్ స్కామ్ లో పవన్ కల్యాణ్ కి కూడా వాటా

మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌వాడ‌:  కాపులం ఏమైనా పవన్ కల్యాణ్‌కు పట్టం కట్టామా..? అంటూ  మంత్రి కొట్టు సత్యనారాయణ నిలదీశారు. పవన్ కల్యాణ్ కాపు జాతిని తాకట్టు పెట్టేశారని మండిప‌డ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు కౌరవులు అని పవన్‌ అంటున్నాడు.. కానీ, వైయ‌స్‌ జగన్‌ వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు.. కౌరవ సేన అంత చంద్రబాబు నాయుడు వెనుకే ఉందని వ్యాఖ్యానించారు.  పవన్ కల్యాణ్‌కు కాపుల గురించి ఏం తెలుసు? అంటూ మంత్రి మండిపడ్డారు.. పవన్ తీసుకునే తింగరి నిర్ణయాలను కాపులు అందరూ సమర్ధించాలని అనుకుంటున్నాడు. కాపుల పరువు తీయవద్దు అంటూ పవన్‌కు విజ్ఞప్తి చేశారు. కాపు పెద్దలను కూర్చో బెట్టి చంద్రబాబుకు మద్దతు ఇద్దాం, అవినీతిపరుడితో పొత్తు పెట్టుకుందాం అని చెప్పాడా? అంటూ పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలోమంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు . కాపు జాతిని పవన్ తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. 
అమరావతి ల్యాండ్ స్కామ్ లో పవన్ కల్యాణ్ కి కూడా వాటా ఉందని ఆరోపణలు చేశారు. దేశం యావత్తు ఈ విష‌యంలో కోడై కూస్తుంది.. పవన్ ప్యాకేజీలకి అమ్ముడుపోతున్నారని.. నేను పవర్ స్టార్ కదా నన్ను ప్యాకేజీ స్టార్ అని అంటున్నారేంటని ఆలోచన, బుద్ది ఉందా అని అడుగుతున్నా? చంద్రబాబుని లోపల వేస్తే సొంత కొడుకు హాయిగా ఉన్నాడు, దత్త కొడుకు రోడ్డు మీద పడుకున్నాడ‌ని మంత్రి ఎద్దేవా చేశారు.

Back to Top