29వ తేదీన రేషన్ సరకులు అందజేస్తాం

నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే కఠిన చర్యలు 

ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరించాలి

తెల్ల కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరకులు, కిలో కందిపప్పు 

మంత్రి కొడాలి నాని 

తాడేపల్లి: కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన తెల్లకార్డుదారులకు రేషన్ సరుకులు ఉచితంగా అందజేస్తామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో నెలకొన్న కరోనా భయం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పడుతోన్న అపోహలతో వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు సీరియన్‌ అయింది. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే జైలుకు పంపుతామని నాని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరించాలని ఇది వారికే కాకుండా దేశానికి కూడా మంచిదని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్ చేసిన సూచనల మేరకు ఈ నెల 29వ తేదీన రేషన్ సరకులు అందజేస్తామని తెలిపారు. తెల్ల కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరకులు, కిలో కందిపప్పు కూడా ఇస్తామన్నారు.

Back to Top