స్కిల్‌ స్కాం సూత్రదారి చంద్రబాబే

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 
 

తాడేపల్లి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం సూత్రదారి చంద్రబాబే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే రిమాండ్‌లో ఉన్నారని మంత్రి చెప్పారు. కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు కోట్లు ఇచ్చి లాయర్లను పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. ప్రజల వద్దకు బాబు యాక్టర్లను పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతిని కక్కిస్తానన్న పవన్‌ టీడీపీతో జతకట్టారని తప్పుపట్టారు. శుక్రవారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

 

తాజా వీడియోలు

Back to Top