ఈనాడు టిష్యూ పేపర్‌గానే పనికొస్తుంది

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
 

విజయవాడ:  ఈనాడు పత్రిక టిష్యూ పేపర్‌గానే పనికొస్తుందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈనాడు తప్పుడు కథనాలను మంత్రి తీవ్రంగా ఖండించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..పౌర సరఫరా శాఖలో సీఎం వైయస్‌ జగన్‌ అనేక మార్పులు తెచ్చారని ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖలో రూ.20 వేల కోట్లు అప్పు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించారని విమర్శించారు. ఈనాడు రామోజీ కూడా వేల కోట్ల రూపాయలు డైవర్ట్‌ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూ. వేల కోట్లు డైవర్ట్‌ చేస్తే నోరు మెదపలేదని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top