చంద్రబాబుది పోరుబాట కాదు.. బోరుబాట

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా

పశ్చిమగోదావరి: చంద్రబాబు చేసేది పోరుబాట కాదు.. బోరుబాట అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. పోరుబాట యాత్రతో టీడీపీ అధికారంలో ఉన్న‌ని ఏళ్లూ రైతులను దగా చేశానని చెబుతావా చంద్రబాబూ..? 2014లో ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టానని చెబుతావా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ఇవ్వని ఇన్‌పుట్‌ సబ్సిడీని 2019లో సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు మేలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబును రైతులు నమ్మే పరిస్థితి లేదని, వ్యవసాయం దండగ అన్న వ్యక్తి.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నాడన్నారు. 

Back to Top