చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?

మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
 

విజ‌య‌వాడ‌: చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా? అని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ జ‌య‌హో బీసీ స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ..  జయహో బీసీ మహాసభకు దాదాపుగా 80వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారని  తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?అని నిలదీశారు. అన్ని బీసీ కులాలకు పదవులిచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే అని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ఇవాళ బీసీల పండుగ. బీసీల తలరాతలు మార్చిన మహానేత సీఎం వైయ‌స్‌ జగన్‌ అని మంత్రి గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు. 

Back to Top