ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
 

విజయవాడ: 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరి కష్టాలు విన్నారు.. దగ్గర నుంచి చూశారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా సీఎం అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తూ.. వైయస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అమలు చేశారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, రహదారి ప్రమాదాలను తగ్గించాల్సిన బాధ్యత ఆటోవాలాలపై ఉందన్నారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ. 10 వేల సాయం త్వరలోనే అందిస్తామన్నారు.

 

Back to Top