టీడీపీ సభ్యుల ప్రవర్తన చిల్లరగా ఉంది

మండలి చైర్మన్‌ పట్ల లోకేష్‌ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు

టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కన్నబాబు ధ్వజం

అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యుల ప్రవర్తన చిల్లరగా ఉందని, సభా సాంప్రదాయాలను పాటించడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుల తీరుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్‌ పట్ల నారా లోకేష్‌ అమర్యాదగా ప్రవర్తించాడని ధ్వజమెత్తారు. సభ సజావుగా జరగనివ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చెబుతున్న మద్యం బ్రాండ్లన్నీ.. సీ (చంద్రబాబు)బ్రాండ్లేనని అన్నారు. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top