గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

మంత్రి కురసాల కన్నబాబు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోల్తా పడిన పడవ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గాలింపు చర్యలను శుక్రవారం కన్నబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం సంభవించిన సమయంలో బోటులో గల్లంతైన వారి సంఖ్య 77గా లెక్క తేలిందని చెప్పారు. ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీశారని అన్నారు. విశాఖకు చెందిన ఓ మహిళ మృతదేహం లభ్యమైందని, ఇంకా 16 మంది మృతదేహాలు దొరకాల్సి ఉందని అన్నారు. ఆ మృతదేహాలు బోటులోనే ఉండొచ్చని భావించారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదానికి గురైన బోటును బయటకు తీయడం కష్టమవుతుందని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బోటు ప్రమాదం సమయంలో 27 మందిని రక్షించిన మత్స్యకారులను ఆయన అభినందించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top