జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి కాకాణి 

నెల్లూరు: వెంకటాచలం మండలం కనుపూరు బిట్- 2 విభిన్న ప్రతిభావంతుల స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళా ను  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా దివ్యాంగులకు ఉద్యోగ పత్రాలు, స్కూటీలను మంత్రి అంద‌జేశారు. విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని అందుకు అనుగుణంగా వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి వివ‌రించారు. విభిన్న ప్రతిభావంతులకు వివిధ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Back to Top