రైతులకు గిట్టుబాటుధర అందాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యం 

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

అమ‌రావ‌తి:  రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర అందాల‌న్న‌దే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మంత్రి మాట్లాడారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా, ఎక్కడైనా రైతులను దళారులు చీట్ చేస్తే వారిపై 420 కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. రైతులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నాం. మార్కెట్ లో రైతుకు గిట్టుబాటుధర తగ్గిన వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది కనుక రైతులు కూడా దళారీల దగ్గర మోసపోకుండా ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. 
అకాల వర్షాలు, వడగళ్లకు పంట నష్టం జరిగింది. దానిపై అంచనాలు తయారు చేయమన్నాం. అంచనా తయారు కాగానే రైతులు కోల్పోయిన పంటకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తాం. అలాగే పంటబీమాను కూడా అందించే ఏర్పాటు చేస్తామ‌ని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Back to Top