ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి: ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.  రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు (వరుసగా మూడో ఏడాది) తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడారు.  
అందరికీ నమస్కారం, రాష్ట్రంలో 86 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉండే పరిస్ధితుల్లో, పంట నష్టం వచ్చినప్పుడు కానీ, మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్న సమయంలో కానీ గతంలో ఏ సీఎం, ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా ఈ రోజు సీఎంగారు అనేక రకాలైన కార్యక్రమాలు అమలుచేస్తూ రైతాంగానికి అండగా నిలబడుతున్నారు. గతంలో రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగడం, వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు చూశాం, కానీ ఈ రోజు గతంలో మాదిరి కాకుండా రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు (వరుసగా మూడో ఏడాది) పారదర్శకంగా ఈ–క్రాప్‌ ఆధారంగా వాస్తవ సాగుదారులను గుర్తించి వారందరికీ ఇవ్వడం జరుగుతుంది, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. పాలకుడు మంచివాడయితే ప్రకృతి సహకరిస్తుంది, సీఎంగారి మంచి మనసు, రైతులకు అండగా నిలవాలన్న ఆలోచన వల్లే జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి, మనం ముందుగా సాగునీరు విడుదల చేయగలిగాం, అలా చేయడంతో పాటు రైతులకు కావాల్సిన పెట్టుబడికి ఆర్ధిక సాయం అందించగలిగాం. ఆర్బీకేల ద్వారా వ్యవస్ధలోనే మార్పులు, రైతుల గుమ్మం ముందుకే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించే ఏర్పాటు చేశాం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం ఇవన్నీ కూడా ఎవరి ఊహకు అందని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒక్కసారి గతంలో టీడీపీ హయాంలో నిత్యం కరువు కాటకాలతో రాష్ట్రం విలవిలలాడింది, టీడీపీ ఎమ్మెల్యేలే గ్రూపులుగా విడిపోయి మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలంటే మా ప్రాంతానికి నీళ్ళంటూ కొట్లాడుకున్న పరిస్ధితి. ఈ రోజు అలాంటి పరిస్ధితి లేదు, ఒక్క కరువు మండలం ప్రకటించలేదు, టీడీపీ హయాంలో 1623 కరువు మండలాలు ప్రకటించారు. ఇదీ పాలన అంటే, సీజన్‌ ముగియకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఇది, రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా డా వైయస్సార్‌ ఉచిత పంటల బీమా ఈ రోజు దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళితే దానికి సంబంధించి రూ. 1,180 కోట్లు ఈ ప్రభుత్వం భరించి ఇవ్వడం జరిగింది. రైతలను ఉదారంగా ఆదుకోవడం కూడా ఈ ప్రభుత్వం చేసింది. నేను, స్పెషల్‌ సీఎస్‌ బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సుకు వెళితే, సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ గారే చెప్పడం జరిగింది.  కేంద్రం ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనలోకి మనల్ని ఆహ్వనించడం జరిగింది. ఈ–క్రాప్‌ విధానం మేం కొనసాగిస్తాం అని దేశానికి పరిచయం చేసే సందర్భం వచ్చింది, ఇది ఏపీ రైతులు గర్వించదగిన విషయం, రైతులకు సంబంధించి ప్రతి చిన్న విషయంలో సీఎంగారు ఒక మాట చెబుతుంటారు, రైతులను ఆదుకోవాలని, వారికి అండగా ఉండాలని, రైతులకు ఎంత చేయగలిగితే అంత చేయాలన్న ఆలోచన, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ రోజు విశ్వసించి ఆచరిస్తున్న సీఎంగారికి రైతాంగ సోదరులంతా నిండు నూరేళ్ళు శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, రైతుల పక్షాన సీఎంగారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.  

జయమ్మ, మహిళా రైతు, ఎర్రవంకపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా

జగనన్నా నమస్తే, నేను బీసీ ఒంటరి మహిళను, నాకు మూడెకరాల పొలం ఉంది, దీనికి గాను రూ. 87 వేల రుణం తీసుకున్నాను, నాకు సున్నా వడ్డీ రూ. 1,791 వచ్చాయి. గతంలో ఇలాంటివి ఏవీ రాలేదు. నేను ఆర్బీకేకి వెళ్ళి జాబితాలో చూసుకున్నాను, నేను ఈ–క్రాప్‌ చేసుకున్నాను, నేను కంది వేసి నష్టపోతే ఇన్సూరెన్స్‌ పరిహారం కూడా రూ. 42 వేలు వచ్చాయి, అదే విధంగా ఈ సారి కూడా ఈ–క్రాప్‌ చేసుకుంటే ఆర్బీకే నుంచి రసీదు కూడా ఇచ్చారు. గతంలో విత్తనాల కోసం రైతులంతా మండలాల చుట్టూ క్యూలలో ఉండి ఇబ్బందులు పడేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్నీ ఆర్బీకేల ద్వారా అన్నీ అందుతున్నాయి, చాలా సంతోషం. నా పిల్లలు చదువుతున్నారు, వారికి విద్యా దీవెన, వసతి దీవెన కూడా వచ్చాయి, చేయూత, ఆసరా కూడా అందాయి, నేను వ్యవసాయంతో పాటు చీరల బిజినెస్‌ కూడా చేస్తున్నాను, నేను రైతు సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను, పొలం బడి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇల్లాలు బావుంటే ఇల్లు బావుంటుందని, రాజు బావుంటే రాజ్యం బావుంటుందని మీ విషయంలో రుజువైంది, చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయి, రైతులంతా సంతోషంగా ఉన్నారు, నాకు ఇప్పటివరకూ రూ. 3,14,000 అన్ని పథకాల ద్వారా అందాయి, మాకు పదికాలాల పాటు మీరు సీఎంగా ఉండాలి, మా రైతులు, మహిళలు మీ వెన్నంటి ఉంటారు, ధన్యవాదాలు. 

నక్కా శ్రీనివాసరావు, రైతు, జి. పెద్దపూడి లంక, బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా

సార్‌ మీరు గతంలో మా లంక గ్రామాలకు వచ్చే ముందు హెలికాఫ్టర్‌ దిగేముందు వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది, గోదావరి కూడా ఉదృతంగా ప్రవహిస్తుంది, అయినా కూడా మీరు మా లంక గ్రామాల పర్యటనకు వచ్చారు, లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని మీరు నాటు పడవలో మా గ్రామానికి వచ్చారు. మీరు మా గ్రామంలో ప్రతి ఒక్కరినీ పలకరించారు, ప్రతి ఒక్కరినీ కూడా ప్రభుత్వం నుంచి సాయం అందిందా లేదా అని అడిగారు, మరుసటి రోజే రూ. 2 వేలు ఆర్ధిక సాయం ఇచ్చారు, మా గ్రామంలో హార్టికల్చర్‌ రైతులు చాలా నష్టపోయారు, జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది రైతులకు రూ. 11 కోట్లు ఈ రోజు జమ చేస్తున్నారు. మా ఆర్ధిక ఇబ్బందులు చాలావరకు తొలగిస్తున్నారు. మీరు చెప్పిన విధంగా పంట నష్ట పరిహారం ఇస్తున్నారు. నేను ఒక ఎకరా పొలంలో అరటి వేస్తే పరిహారం క్రింద రూ. 10 వేలు వస్తున్నట్లు తెలిసింది, నాకు రైతు భరోసా కూడా వస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, వారిని ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నాను, నా భార్యకు డ్వాక్రా రుణాలు వస్తున్నాయి, నా తండ్రికి ఫించన్‌ వస్తుంది, వలంటీర్‌ వ్యవస్ధ ద్వారా ప్రతి పథకం ప్రతి వ్యక్తికి అందుతుంది, దేశంలో అవినీతి లేకుండా నెంబర్‌వన్‌ రాష్ట్రంగా మన రాష్ట్రం ఎదిగింది. గతంలో ఏ సీఎం మా లంక గ్రామాలకు రాలేదు, మీరు వచ్చి మా లంక గ్రామాలను అభివృద్ది చేస్తున్నారు, మాకు వంతెన కూడా ఇచ్చారు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ధ్యాంక్యూ సార్‌ అని ముగించగా ఆ గ్రామంలో వంతెన నిర్మాణానికి సంబంధించి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్‌ను సీఎం వివరాలు అడిగారు. అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 

వెంకట లక్ష్మి, మహిళా రైతు, ముద్దాడ, శ్రీకాకుళం జిల్లా

అన్నా నేను సన్నకారు మహిళా రైతును, ఈ సున్నా వడ్డీ పథకం వల్ల ప్రతి రైతు లబ్ధిపొందుతున్నారు, నాకు రెండెకరాల భూమి ఉంది, దీనిపై రూ. 93 వేల రుణం తీసుకున్నాను, దీనిపై రూ. 3,700 వడ్డీ రాయితీ వచ్చింది, నాలా చాలా మంది రైతులు లబ్ధిపొందారు. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌ నమోదు చేసుకోవడం బావుంది, ప్రతి రైతుకు అన్నీ అందుతున్నాయి, విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ అందుతున్నాయి, ఒకప్పుడు దళారుల దగ్గర తీసుకున్న డబ్బుకు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడేవారు, గ్రామ స్ధాయిలో పొలం బడి కార్యక్రమం ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు, నేను రైతు భరోసా సాయం అందుకున్నాను, నాకు చేయూత పథకం అందింది, నా పిల్లలకు అమ్మ ఒడి సాయం అందింది, నేను పొదుపు సంఘం సభ్యురాలిని, మేం చాలా సంతోషంగా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు బాగా పండుతున్నాయి, వర్షాలు బాగా కురుస్తున్నాయి, ఎవరికి ఏ సమస్య వచ్చినా సచివాలయంలో పరిష్కరిస్తున్నారు. నేను ఈ ప్రభుత్వంలో రూ. 5 లక్షలు పొందాను, నాలా చాలా మంది లబ్ధి పొందారు, ధన్యవాదాలు.

Back to Top