సినిమాల్లో హీరో కావొచ్చు.. రాజకీయాల్లో పవన్‌ జీరో

చంద్రబాబు స్నేహంతో పవన్‌కు కూడా మతిమరుపు రోగం

పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారు

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్‌కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో మాత్రం జీరో అని అన్నారు. మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే.. వికేంద్రీకరణను పవన్‌ వ్యతిరేకిస్తున్నాడని గుర్తుచేశారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

పవన్‌కు రాజకీయ విలువలు, నిబద్ధత లేవు కాబట్టే పోటీ చేసిన రెండు చోట్ల ఓడించారని, పవన్‌ను ప్యాకేజీ స్టార్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. నారా వారి రాజ్యాంగంలో విశాఖ ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ జగన్‌ని పోలీసులు అడ్డుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టే పవన్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు. 

చంద్రబాబుకి ఆయన సొంత పుత్రుడిపై నమ్మకం లేక.. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధిపొందాలని చూస్తున్నాడన్నారు. 2024లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదన్నారు. చంద్రబాబు, పవన్‌ లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ని విమర్శించే అర్హత పవన్‌కి లేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్‌ గల్లంతైపోయిందన్నారు. రాజకీయ ఓనమాలు నేర్వని పవన్‌ కల్యాణ్‌ గాలికి కొట్టుకుపోతాడన్నారు. 

కనీస పరిజ్ఞానం లేకుండా పవన్‌ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కాకాణి అన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజ్యాంగానికి అతీతుడా అని ప్రశ్నించారు. సీఎం కావాలని పగటి కలలు కంటే సరిపోదని, హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలని పవన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top