ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి కాకాణి ప‌రామ‌ర్శ‌

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా :  రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి నెల్లూరు అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి ప‌రామ‌ర్శించారు.  చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.  విష‌యం తెలుసుకున్న మంత్రి కాకాణి ఆసుప‌త్రికి చేరుకొని ఎమ్మెల్సీ  ఆరోగ్య పరిస్థితిని అపోలో హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి మంత్రి సూచించారు.  అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి త్వ‌ర‌గా కోలుకోవాలని మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.

Back to Top