విజయవాడ: కోనసీమ జిల్లాలోని వరద ప్రభావానికి గురైన అయినవల్లి మండలంలోని లంక గ్రామాలలో వరద పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి జోగి రమేష్ స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. శుక్రవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలో ప్రయాణించి.. భాధితుల సమస్యలను విని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, మందులు అందుబాటులో ఉంచాలని, ఏ విధమైన పరిస్థితి నైనా ఎదురు కోవటానికి రెస్క్యూ బృందాలు సిద్ధం గా ఉండాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు.