బలహీనవర్గాల బలం సీఎం వైయస్‌ జగన్‌

పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరణలో చూపించిన ఏకైక నాయకుడు

వైయస్‌ జగన్‌ పాలనలో బీసీలంతా తలెత్తుకొని జీవిస్తున్నారు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

విజయవాడ: బలహీనవర్గాలకు అండగా బలమైన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిలిచారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో చూపించిన నాయకుడు వైయస్‌ జగన్‌ అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాజిక న్యాయం ప్రస్పుటంగా కనిపిస్తోందని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జయహో బీసీ మహాసభ ఏర్పాట్లను మంత్రి జోగి రమేష్‌ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగిందనేది రేపు బీసీ మహాసభ ద్వారా చూపించబోతున్నామన్నారు. 82 వేల మంది ప్రజాప్రతినిధులు జయహో బీసీ మహాసభకు హాజరుకానున్నారని వివరించారు.  రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు సభ్యుడి వరకు 82 వేల మంది ఒకే ప్రాంగణంలో జయహో బీసీ, జయహో జగనన్న అని నినదించబోతున్నారని చెప్పారు.  

‘‘బలహీనవర్గాలకు తోడుగా నిలిచిన బలమైన నాయకుడు వైయస్‌ జగన్‌. మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలు, సిద్ధాంతాలు చదివాం.. విన్నాం. ఆ మహనీయుడి ఆలోచనలు ఎప్పుడు ఆచరణలోకి వస్తాయని ఎదురుచూశాం. మూడున్నరేళ్లుగా ఆంధ్రరాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు, ఆలోచనలు ఆచరణలో చూపించిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 

బీసీలకు ఆత్మగౌరవం ఇచ్చింది సీఎం వైయస్‌ జగన్‌. బీసీలంతా తలెత్తుకొని జీవించేలా చేశారు. ఏరోజు అయినా బలహీనవర్గాలకు చెందినవారికి చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇచ్చాడా..? పెద్ద పెద్ద కోటీశ్వరులు, పారిశ్రామిక వేత్తల దగ్గర సూటికేసులు తీసుకొని రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు’’ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.  
 

Back to Top