ఆ తీర్మానం చేసే స‌త్తా బాబుకు, అచ్చెన్నాయుడికి ఉందా..?

సామాజిక న్యాయం గురించి ప‌నికిమాలిన టీడీపీకి ఏం తెలుసు..?

వైయ‌స్ఆర్ సీపీ ప్లీన‌రీ గ్రాండ్ స‌క్సెస్‌ను దేశ‌మంతా చూసింది 

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్‌

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు అంగరంగ వైభవంగా జరిగాయని, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై అచంచల విశ్వాసంతో కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర నలుమూలల నుంచి తండోపతండాలుగా తరలివచ్చి ప్లీనరీని గ్రాండ్‌ సక్సెస్‌ చేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ప్లీనరీ ఏ విధంగా విజయవంతమైందో దేశమంతా చూసిందన్నారు. విజయవాడలో మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. 

కొంతమంది పనికిమాలిన పచ్చ నేతలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తల్లిగా వైయస్‌ విజయమ్మ తీసుకున్న అందరూ గౌరవిస్తారు.. శిరసావహిస్తారని మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. వైయస్‌ విజయమ్మ నిర్ణయం కొంత బాధగా ఉన్నప్పటికీ.. అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించారన్నారు. తల్లికి రెండు కళ్లు.. జగనన్న, షర్మిలమ్మ బాగుండాలని వైయస్‌ విజయమ్మ తీసుకున్న నిర్ణయం అందరికీ శిరోధార్యమన్నారు.

జీవితకాలం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా సీఎం వైయస్‌ జగన్‌ కొనసాగుతారని, లక్షలాది మంది కార్యకర్తలందరూ తీర్మానాన్ని ఆమోదించారని మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. సామాజిక న్యాయం గురించి పనికిమాలిన అచ్చెన్నాయుడికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్థానం కల్పించారన్నారు. 17 మంది కాదు. 18 మందికి మంత్రి పదవులు ఇవ్వగలం అని తీర్మానం చేసే సత్తా అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు లేదని, చ‌ర్చ పెడితే పారిపోతార‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top