బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..?

చంద్ర‌బాబుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సూటి ప్రశ్న

బీసీ మహాసభ సక్సెస్‌తో చంద్ర‌బాబుకు బీపీ

2024లో టీడీపీ చిత్తుచిత్తుగా టీడీపీ ఓటమి ఖాయం

బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన ధీరుడు ‘జగనన్న’

జగనన్న గుండెల్లో బీసీల స్థానం చెక్కుచెదరనిది

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ సీపీ జ‌య‌హో బీసీ మ‌హాస‌భ స‌క్సెస్‌తో ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబుకు బీపీ పెరిగింద‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టిన ధీరుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అని గుర్తుచేశారు. దేశ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీసీ ప్రభంజనం చూశామ‌ని, విజయవాడ కేంద్రంగా ‘జయహో బీసీ మహాసభ’ సూపర్‌ సక్సెస్‌ అయ్యింద‌న్నారు. స‌భ‌ను విజ‌య‌వంతం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మూడున్నరేళ్ల వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు ఉవ్వెత్తున కదలివచ్చారు కనుకే కనీవినీ ఎరుగని రీతిగా సభ విజయవంతమైంద‌ని మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 
 
మంత్రి జోగి రమేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనతను వెలుగెత్తి చాటుకునేందుకు.. ఆయన పట్ల కృతజ్ఞత చూపించుకునేందుకు బీసీలు ఉత్సాహంగా కదంతొక్కారు. పంచాయతీ బోర్డు మెంబర్‌ నుంచి రాజ్యసభ మెంబర్‌ వరకు 85వేల మంది బీసీ ప్రజాప్రతినిధులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి బలహీన వర్గాల ప్రజలు ఉవ్వెత్తున కదలివచ్చినందుకు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మహాసభ సక్సెస్‌ను చూడగానే చంద్రబాబుకు బీపీ పెరిగింది. ‘బాబూ .. నీ 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఇంతమంది (85వేల) ప్రజాప్రతి నిధులను తయారు చేయగలిగావా..?’ . చంద్రబాబు తన అధికార హయాంలో పదవులన్నీ అతని సొంత సామాజికవర్గం వారికే కట్టబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. బాబు దృష్టిలో బీసీలంటే బానిసలుగా ఉండటమేనా..? రాజ్యసభకు ఎవరినైనా పంపాలంటే పారిశ్రామికవేత్తలు.. సూటుకేస్లు బాబు కళ్లకు కనిపిస్తాయి. రాజ్యసభ పదవికి ఒక్క బీసీ నాయకుడు కూడా అర్హుడు కాడన్నది బాబు అభిప్రాయం. 

బలహీనవర్గాలు వృత్తుల్లోనే మగ్గిపోవాలా బాబూ..?
ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. ‘మీరు వృత్తుల్లో మగ్గిపోండి..’ అంటూ కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలు, మోకుతాళ్లు వంటి పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటాడు..అంటే, ఆయన సిద్ధాంతం ప్రకారం బీసీలు తాతలు, తండ్రుల దగ్గర్నుంచి నేటి తరం వరకు అందరూ కులవృత్తుల్లోనే మగ్గిపోవాలని నిర్ణయిస్తాడు. మా పిల్లలు చదువుకోకూడదా..? ఎల్లకాలం చంద్రబాబుకు కట్టుబానిసల్లాగా ఊడిగం చేయాల్నా..?  అసలు బలహీనవర్గాలకు నువ్వు ఏంచేశావని నీకు డీఎన్‌ఏగా ఉండాలి..? నీ పార్టీలో అచ్చెన్న, అయ్యన్న ఉంటే బీసీలంతా నీ బానిసగాళ్లకింద ఏ విధంగా జమకడతావు బాబూ..? టీడీపీ హయాంలో బీసీల సంక్షేమానికి ఏం చేశారో చర్చకు రమ్మంటే.. బాబు, అతని బానిసగాళ్లు పారిపోతారు. 
 
జగనన్న దీవెనలతో బీసీల పిల్లలు నేడు ఉన్నతవిద్యావంతులు
ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకంతో బీసీల పిల్లలు ఉన్నత విద్యావంతులవ్వాలని ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం మొట్టమొదటిసారిగా నిలబెట్టింది దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన తనయుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి కంటే రెండడుగులు ముందుకేసి బీసీల పిల్లల్ని ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నారు. 
బలహీనవర్గాల పిల్లలు చిన్నతనం నుంచే విద్య నేర్వాలని.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కులవృత్తుల్లోనే మా తాతలు, తండ్రులతో పాటు మా పిల్లలు మగ్గిపోవాలనేది చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనైతే.. మంచి చదువులతో దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేయాలనేది మా జగనన్న ఆలోచన.

బాబూ.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీచేస్తావా..? 
బీసీలకు పెద్దపీట వేశానంటూ బాబు ఊదరగొడితే నమ్మేందుకు ప్రజలేమైనా పిచ్చోళ్లా..? ఆయన నిజంగా పెద్దపీటే వేసి ఉంటే.. 2019లో 23 స్థానాలకే పరిమితం చేయరు కదా..? 2014లో కూడా ఇదే మాదిరిగా మోసకారి మాటల్ని జనం నమ్మారు కనుకే బాబు అప్పుడు అధికారంలో కొచ్చారు. ఆ తర్వాత 2019లో బాబు నైజం, ఆయన మాటల్లోని నిజం జనాలకు పూర్తిగా అర్ధమైంది కనుకనే బుద్ధిచెప్పి ఇంటికి పంపారు. ఇప్పుడు మళ్లీ పర్యటనల పేరిట చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని పగటి వేషగాడిలా తిరుగుతున్నాడు. వైయ‌స్సార్ సీపీని సైకోపార్టీ అంటున్నాడు. ‘బాబూ.. నువ్కొక పెద్ద సైకో.. నీ దత్తపుత్రుడు మరో సైకో.. అని ప్రజలు ఏనాడో డిసైడ్‌ ఆయ్యారు.’ అసలు టీడీపీ తరఫున ఈసారి 175 స్థానాల్లో సింగిల్‌ పోటీచేసే దమ్ముందా..? అన్ని స్థానాల్లో నిలబెట్టేందుకు మీ తరఫున అభ్యర్థులు ఉన్నారా..? బాబు, ఆయన దత్తపుత్రుడు  పొత్తులతో పొర్లినా ఎక్కడా ఒక్క సీటు కూడా తెచ్చుకోలేరు. మీరంతా చాపా-దిండు సర్దుకుని పోవాల్సిందే.. 

బాబుకు, ఎల్లోమీడియా పైత్యం..
‘దశాబ్ధాలుగా బానిసల్ని చేసి మమ్మల్ని వాడుకుని .. మా తోకలు కత్తిరిస్తానని, మమ్మల్ని కొడతానని బెదిరించావుగా బాబూ.. వాటన్నింటినీ మా బీసీలు ఎలా మరిచిపోతారు..?’ చంద్రబాబు ఎంత పొర్లుదండాలు పెట్టి నేలమీద దేకినా  బాబు చేసిన దుర్మార్గాలను బలహీనవర్గాల ప్రజలు మరిచిపోలేరు. అతనికి 2024 ఎన్నికలే చివరివని గట్టిగా బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మా బలహీనవర్గాల్ని కించపరిచేవిధంగా కొన్ని ఛానెల్స్, పత్రికలు నీచంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మా బీసీలు లిక్కర్‌ పోస్తే సభలకు వస్తారని.. ఆ విధంగానే బీసీ సభ సక్సెస్‌ అయ్యిందని రాయడానికి పచ్చ మీడియాకు సిగ్గుందా..? పచ్చరక్తం నరనరాన జీర్ణించుకుని కథనాలు రాస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. తాగడానికి వచ్చారని మమ్మల్నికించపరిస్తే.. బాబుకు, ఆయన తాబేదార్లుగా ఉన్న ఎల్లోమీడియాకు కూడా తగినబుద్ధి చెప్పేందుకు మా బీసీలు సిద్ధంగా ఉన్నారు. 

బీసీల గుండెల్లో జగనన్న..
బీసీల గుండెల్లో జగనన్న అభినవ ఫూలేలా చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఆయన స్థానం చెక్కుచెదరనిది. నాడు ఏలూరు బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్‌ను నూటికి నూటపది శాతం అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుంది. మూడున్నరేళ్ల పాలనలో అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా.. తదితర పథకాల పేరిట బీసీలకు అభివృద్ధి, సంక్షేమం ప్రతీ గడపకు అందించారు. అందుకే బీసీల గుండెల్లో జగనన్న ఉన్నారు. 175 స్థానాలకి 175 గెలవడమనే బాధ్యతను బీసీలుగా మేం భుజానకెత్తుకున్నాం.

Back to Top