టీడీపీ.. తెలుగు బూతులు, తెలుగు దొంగల పార్టీ కాదా..?

2019 ఎన్నికల్లో బట్టలూడిపోయిన బాబు.. బట్టలూడదీసి కొడతాడంట..

వార్డు మెంబర్‌గా గెలవలేని పిల్ల సైకోకు సీఎం గురించి మాట్లాడే అర్హతుందా..?

పవన్‌ది సైకో సేన.. వీధి రౌడీలు, పిక్‌ పాకెట్‌గాళ్లను తయారు చేస్తున్నాడు

ప్యాకేజీ కల్యాణ్‌ చూపించిన చెప్పులు చంద్రబాబే కొనిచ్చాడా..?

ఎంతమంది కట్టకట్టుకొచ్చినా మా నాయకుడిని ఏమీ చేయలేరు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

తాడేపల్లి: టీడీపీ.. తెలుగు బూతులు, తెలుగు దొంగలు, తెలుగు డ్రామాలు, తెలుగు వెన్నుపోటుదారుల పార్టీ కాదా..? చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. 2019 ఎన్నికల తరువాత బట్టలూడిపోయిన చంద్రబాబు.. పబ్లిక్‌ మీటింగ్‌లలో ప్రజలను బట్టలూడదీసి కొడతానని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. వీకెండ్‌లో ఏపీకి వచ్చి వెళ్లిపోయే ప్యాకేజీ కల్యాణ్‌ది సైకో సేన అని, వీధి రౌడీలు, అర్ధరాత్రి సంచరించేవారు, పిక్‌ పాకెట్‌గాళ్లను ఈ సైకో కల్యాణ్‌ తయారు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ ఏం మాట్లాడారంటే.. 

ఉత్తరాంధ్రలో ఒక అచ్చోసిన వెధవ అయ్యన్న, పనికిమాలిన చవట చంద్రబాబు, పిల్ల సైకో పప్పు లోకేష్, ప్యాకేజీ సైకో ఏ విధంగా మాట్లాడారో చాలాసార్లు విన్నాం. సైకో భాషవాడే వారిని సైకోలనే అంటాం. చంద్రబాబు 75 సంవత్సరాల వయసులో అధికారం కోసం ఇంతగా దిగజారాలా..? ఏం ఖర్మ పట్టిందిరా బాబూ మీకు. అధికారం కోసం పబ్లిక్‌ మీటింగ్‌లో బూతులు మాట్లాడుతావా..? ఇక మీది తెలుగు బూతులు, తెలుగు దొంగలు, తెలుగు డ్రామాలు, తెలుగు వెన్నుపోటుదారుల పార్టీ కాదా..? చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి. 

తెలుగు బూతుల పార్టీ అంటే ఇంతపొడుచుకొచ్చిందా..? అసలు బాబు నిజస్వరూపమే బూతులు, దాడులు, దోపిడీ. అన్నం పెట్టిన అమ్మను, పిల్లనిచ్చిన మామను కొడతాడు.. రాళ్లు, వేయించి, చెప్పులతో కొట్టించి, ఆయన పెట్టిన పార్టీని, జెండాను లాక్కున్నాడు. ఆఖరికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ను కూడా లాక్కున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి..? ఏ మాటలతో చంద్రబాబును సంబోధించాలి. 

పాడె మీద మోసుకెళ్తున్న టీడీపీని రక్షించుకోలేని నారా చంద్రబాబు, పక్కపార్టీల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. చంద్రబాబు పని అయిపోయింది. అడ్రస్‌ గల్లంతైంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో 86 నియోజకవర్గాల్లో కనీసం స్పందన రాలేదని, డీ గ్రేడ్‌లో ఉన్నారని, ఇంకో 80 నియోజకవర్గాల్లో సీ గ్రేడ్‌లో ఉన్నామని టీడీపీ సర్వేలోనే తేలిన పరిస్థితి. టీడీపీ చచ్చిపోయిందని వాళ్ల రివ్యూలోనే తేలిపోయింది. 

సీఎం వైయస్‌ జగన్‌ అనే ధీశాలిని ఎదుర్కోవాలంటే బలం సరిపోదని చంద్రబాబుకు అర్థమైంది. అందుకే వేరే వారి కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో జనం చెప్పుతో కొడితే 23 సీట్లకు పరిమితమయ్యారని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్‌ను ఎదుర్కోవాలంటే.. చంద్రబాబు బలం సరిపోక వేరే వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితిని చూశాం. ప్రజల కోసం పనిచేసే మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఎంతమంది కలిసి వచ్చినా ధీరుడు లాంటి మా నాయకుడిని ఏమీ చేయలేరు.

నిష్ట దరిద్రుడు అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తున్నాడు. అయ్యన్న నోరు జాగ్రత్తగా పెట్టుకో.. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని పిల్ల సైకో, లోకజ్ఞానం లేని లోకేష్‌ కూడా సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శిస్తున్నాడు. పప్పు తన స్థాయి తాను తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇలాంటివారందరినీ వైయస్‌ జగన్‌ ఒంటరిగా సింహంలా వేటాడాడు. ఒకే పార్టీ,  ఒకే వ్యక్తి, సింగిల్‌గా వచ్చి 151 సీట్లు సంపాదించాడు. 

ప్యాకేజీ కల్యాణ్‌ వీకెండ్‌లో ఏపీకి వచ్చి వెళ్లిపోతున్నాడు. కొట్టుకుందాం అని చెప్పు చూపిస్తున్నాడు. ప్యాకేజీ కల్యాణ్‌కు ఆ చెప్పులు కూడా చంద్రబాబే కొనిపెట్టి ఉంటాడు. పవన్‌ కల్యాణ్‌ది సైకో సేన, వీధి రౌడీలు, అర్ధరాత్రి సంచరించేవారు, పిక్‌ పాకెట్‌గాళ్లను ఈ సైకో కల్యాణ్‌ తయారు చేస్తున్నాడు. దొడ్డిదారిన గుంపులుగా చేరి ఈ సైకో బ్యాచ్‌ దాడులు చేస్తుంది. వీరిని సైకో లీడర్‌ కల్యాణ్‌ ప్రోత్సహిస్తున్నాడు. పనికిరాని వెధవలు అంతా మీడియా ముందుకు వచ్చి చౌకబారు మాటలు, తిట్టడాలు చేస్తున్నారు. జనమంతా మా దరిద్రం వదిలిపోయింది. మాకు పట్టిన శనిపోయింది. మేము సంతోషంగా ఉన్నాం. సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనలోఅభివృద్ధి, సంక్షేమం రెండూ మా గడప వద్దకు వస్తున్నాయి.. మేము సంతోషంగా ఉన్నాం.. పిల్లలను చదివించుకుంటున్నాం అని అందరూ సంతోషిస్తున్నారు‘‘ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 
 

Back to Top