రాష్ట్రంలో సంక్షేమం ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?

మంత్రి జోగి రమేష్‌

గుంటూరు:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సంక్షేమం ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? అంటూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. ఎల్లో మీడియా- దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లో మీడియాకు ఎందుకింత కుళ్లు అని ప్రశ్నించారు.
 ‘‘ఎల్లో మీడియా ప్రతిరోజు విషం చిమ్ముతోందని.. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తోందని జోగి రమేష్‌ నిప్పులు చెరిగారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు అడ్రస్‌ లేదు, ఇల్లు లేదు. రామోజీరావుకు ఏపీలో ఇల్లు ఉందా, డోర్‌ నెంబర్‌ ఉందా?. ఏబీఎన్‌ రాధాకృష్ణకు ఏపీలో అడ్రస్‌ ఉందా?. టీవీ5 నాయుడు డబ్బా ఛానల్‌తో  దుష్ప్రచారం చేస్తున్నాడు’’ అని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు.

 

తాజా వీడియోలు

Back to Top