అభివృద్ధిని కనులారా చూసేందుకు ఏపీకి రండి కేటీఆర్‌..

కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్‌ కౌంటర్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కనులారా చూసేందుకు కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నానని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూసివెళ్తున్నారన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున ఊళ్లే నిర్మాణమవుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల పనితీరుపై దేశమే ఏపీ వైపు చూస్తోందన్నారు. సీఎం టు కామన్‌ మ్యాన్‌ విధానం ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? అది ఏపీలో మాత్రమే సాధ్యమవుతోందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 
 

Back to Top