ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో భారీ మెజార్టీ సాధిస్తాం

రాష్ట్రంలో బ‌ల‌మైన శ‌క్తి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆరిపోయే దీపం టీడీపీ

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో మంత్రి జోగి రమేష్‌

నెల్లూరు: ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి అత్య‌ధిక మెజార్టీతో విజ‌యం సాధిస్తార‌ని మంత్రి జోగి ర‌మేష్ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ నెల 23 న జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా శ్రీధర్ గార్డెన్స్‌లో  ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగింద‌న్నారు. తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం లాంటిద‌ని ఎద్దేవా చేశారు. బద్వేల్‌ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందని.. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషిచేయాలని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటన్నారు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చాడని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సార‌థ్యంలో గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రం పయనిస్తోందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top