చంద్రబాబుకు సిగ్గుంటే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలి

మంత్రి గుమ్మనూరు జయరాం

అమరావతి: చంద్రబాబుకు సిగ్గుంటే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని మంత్రి గుమ్మనూరు జయరాం డిమాండు చేశారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గు రావడం లేదని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందు చంద్రబాబు నిలవడం సాధ్యం కాదని మంత్రి అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసి 14 పంచాయతీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వ్యతిరేకి చంద్రబాబు అని మండిపడ్డారు.
 

Back to Top