విజయవాడ: ఢిల్లీ తరువాత విజయవాడ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలోనే ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. విజయవాడ గుణదలలో ఆధునీకరించిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని మంత్రి గుమ్మనూరి జయరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్పెన్సరీలో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. రోగి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని సౌకర్యాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు.