సీఎం వైయ‌స్ జగన్ పాలన దేవుడిచ్చిన వరం

మంత్రి గుమ్మనూరు జయరామ్‌

 విజయవాడ: సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి పాలన దేవుడిచ్చిన వరమ‌ని,  అందుకే తొలిరోజు నుంచిరాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయ‌ని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం పేర్కొన్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న చంద్రబాబుకి దేవుడు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని  మండిపడ్డారు.  ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల మతాలకతీతంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. సీఎం ఏ పథకం ప్రవేశపెట్టిన.. ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

Back to Top