అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర  

మంత్రి గుడివాడ అమర్నాథ్
 

విశాఖ‌:   అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర  అని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిప‌డ్డారు.  వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతుల‌ను తరిమికొట్టేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని  హెచ్చరించారు. తక్షణమే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని కావాలనే ఆకాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. భూములను కాపాడుకునేందుకు, రేట్లు పెరిగేందుకే అమరావతి రైతులు తాపత్రయపడుతున్నారని విమర్శలు చేశారు. తాము మాత్రం అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.   

Back to Top