పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

జనసేన పేరు మార్చి చంద్రసేన అని పెట్టుకుంటే బెటర్‌

పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు రక్తం

విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఓ రాజ‌కీయ వ్య‌భిచారి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు.  పవన్‌ స్పీచ్‌ ఆంబోతు రంకెలేసినట్టు ఉంది. పవన్‌ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ లేవు. పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.కాపుల మీద పవన్‌కు పేటెంట్‌ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు.
పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం కాదు మాది. పవన్‌ నీల డబ్బుకు అమ్ముడుపోయే కుటుంబం కాదు మాది. జనసేన పేరు మార్చి చంద్రసేన పెట్టుకుంటే బెటర్‌.పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు రక్తం. ప‌వన్‌కు ఉన్నవి నారా వారి నరాలు’ అని విమర్శించారు. మంత్రి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

 "చంద్రసేన"గా మార్చుకో..

   పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అని, ఆయన పార్టీకి సిద్ధాంతం, లక్ష్యం లేదని ఆంబోతు తోకకు కమ్మ కట్టి నిప్పంటించి పరిగెత్తిస్తే ఎలా ఉంటుందో రణస్థలంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అలా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  శీలావతి గంజాయి తాగి మాట్లాడుతున్నట్లు పవన్ మాట్లాడారని అన్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి పోతానని చెప్పకనే చెప్పిన పవన్ కళ్యాణ్.. తన పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకుంటే బాగుంటుందని అమర్నాథ్ సూచించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లో "నారావారి నరాలు.. కమ్మని పసుపు రక్తం నిండి ఉంది" కాబట్టి అందుకు తగ్గట్టుగా పార్టీ పేరు కూడా మార్చుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు ఉన్న అక్రమ సంబంధాన్ని సక్రమం చేసుకునేందుకే రణస్థలం సభను వేదికగా, రోడ్ మ్యాప్ గా మలుచుకున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీలకు సిద్ధాంతం, లక్ష్యం ఉంటుంది. కానీ పవన్ పార్టీకి అటువంటివేవీ లేవని ఆయన విమర్శించారు. 

నీ భార్యాబిడ్డల పేర్లు అయినా తెలుసా..?
"రాష్ట్ర ఐటీ మంత్రి పేరు ఆయనకు తెలియదట.. నా కుటుంబం పేరు ఎన్నో దశాబ్దాలుగా అందరికీ తెలుసు. 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నాది. మీ నాన్న కానిస్టేబుల్ కాకమునుపు, మీ అన్న పునాదిరాళ్లు సినిమా తీయక మునుపు మా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. నువ్వు పుట్టక మునుపు మా తాత పెందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మీలా సన్నాసి రాజకీయాలు చేసే కుటుంబం మాది కాదు.. ప్యాకేజీలు తీసుకుని అమ్ముడుపోయే కుటుంబం కాదు. నాది విలువల గల రాజకీయం.. నీది నీచ రాజకీయం " అని మంత్రి అమర్నాథ్, పవన్ కళ్యాణ్ ను తూర్పారబట్టారు. ఐటీ మంత్రి పేరు తెలియదు సరే.. కనీసం నీ భార్యా పిల్లల పేర్లైనా తెలుసా? ఠకీ మనీ చెప్పగలవా.. అని అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.

పోరాటం లేదు.. ప్యాకేజీ కోసం ఆరాటమే
పోరాటం తప్ప తనకేమీ తెలియదు అంటున్న పవన్ కళ్యాణ్.. రణస్థలం సభలో తన ప్యాకేజీ ఆరాటమేమిటో బయటపెట్టారని ఆయన అన్నారు. రణస్థలం సభ హెడ్లైన్ కి, స్టోరీ కి సంబంధం లేదు. స్క్రిప్ట్ కి, డైలాగులు కి అసలే సంబంధం లేదు. ఆయన నటించిన అన్ని సినిమాల డైలాగులు ఒకే సభలో కలిపి చెప్పడం వల్ల అక్కడున్న జనానికి ఏమీ అర్థం కాకుండా పోయింది అని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. జీవితమే పోరాటం అని దర్శకుడు త్రివిక్రమ్ రాస్తే.. ఒంటరిగా పోటీ చేస్తే వీర మరణమే అని చంద్రబాబు రాశారు...బూతులేమో సొంతంగా  పవన్ రాసుకున్నారు అని అమర్నాథ్ అన్నారు. సభకు వచ్చిన యువకులంతా ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు ఏం చెప్పాలి? మా నాయకుడు మమ్మల్ని మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్పాడని చెప్పమంటావా? అని అమర్నాథ్ ప్రశ్నించారు.

11మందిని చంపిన బాబుకు పవన్ పరామర్శా..?
 ఒక రాజకీయ వ్యభిచారి, చంద్రబాబు నాయుడు కలిసి ఒకే గదిలో కూర్చొని దేశం కోసమో, లేక రాష్ట్రం మేలు కోసమో చర్చించారు అంటే ఎవరు నమ్ముతారు? అని అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ విశాఖలో మంత్రుల మీద రాళ్లు వేయిస్తే..చంద్రబాబు 11 మందిని చంపేశారు. వీరు ఒకరి నొక్కరు పరామర్శించుకుంటారా? అని అమర్నాథ్ విమర్శించారు. రణస్థలం సభ సాక్షిగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేస్తానని చెప్పకనే చెప్పిన పవన్ కళ్యాణ్.. మీరంతా కలిసి ఈ పొత్తుల పార్టీని మోయాలంటూ తన పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేసినట్టు కనిపిస్తోంది అని అమర్నాథ్ అన్నారు. రణస్థలం సభ ఒక ఈవెంట్ గా నిర్వహించిన పవన్ కళ్యాణ్.. సభకు వచ్చిన వారిపై తనకు నమ్మకం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని.. దీంతో పవన్ కళ్యాణ్ పై కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకం చెదిరిపోయిందని అమర్నాథ్ అన్నారు.

ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్..
పి.ఎస్.పి.కె అంటే ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్ అని అమర్నాథ్ అన్నారు. సినిమాలో పవర్ స్టార్ కావచ్చు కానీ నిజ జీవితంలో ప్యాకేజి స్టార్ వి. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలే సభలో చెప్పి ఆయన ఇచ్చిన మూటలు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్యాకేజీ తీసుకోలేదని  సింహాద్రి అప్పన్న పైన... ఆయన తల్లి పైన, ఆయన అన్నపై న ప్రమాణం చేయగలరా?అని అమర్నాథ్ ప్రశ్నించారు. తన తల్లిని తిట్టిన వ్యక్తిని భుజానికి ఎత్తుకుని మోస్తున్నపవన్ కళ్యాణ్ బానిస కాక,బాహుబలి ఎలా అవుతాడని అమర్నాథ్ ప్రశ్నించారు. వంగ వీటి రంగాను హత్య చేసిన వ్యక్తిని, ముద్ర గడను ఈడ్చి కొట్టిన వ్యక్తులను పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారని ఆయన అన్నారు. కాపులను తిట్టటానికి పవన్ కళ్యాణ్, ఏమైనా పేటెంట్ హక్కులు తీసుకున్నారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడే ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి పోయాడు.. ఇప్పుడు ఆయన బాబుకు పొలిటికల్ వైఫ్ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

జగన్ గారు హీరో.. పవన్ విలన్
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అమర్నాథ్ తీవ్రంగా పరిగణించారు.  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఖైదీగా ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో పవన్ విలన్ అని.. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు హీరో అని అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వైఎస్ ఆర్సీపీని ఎదుర్కొనే స్థాయి ఆయనకు లేదని అమర్నాథ్ చెప్పారు. 2024లో మళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అని చెప్పారు. కాగా బిజెపితో పవన్ కళ్యాణ్ కి ఉన్న సంబంధం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బాబు హయాంలో ఏం చేశారని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు
 రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఎప్పుడైనా ఆలోచించారా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పదవీకాలంలో రాష్ట్రంలో చేసిన పారిశ్రామిక అభివృద్ధి కన్నా, గడిచిన మూడున్నర సంవత్సరాలలో తమ ప్రభుత్వం అంతకుమించి అభివృద్ధి చేసిందని అమర్నాథ్ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేశారని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అడిగారా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మీడియాకు చూపించడానికి తాన సిద్ధంగా ఉన్నానని అమర్నాథ్ చెప్పారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారని, ఇటీవల విశాఖలో జరిగిన ప్రధానమంత్రి సభలో పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షలాదిమంది సాక్షిగా ప్రధానిని కోరారని ఆయన చెప్పారు. 

- ఇదిలా ఉండగా తాను ఒక మహిళపై కేసు పెట్టానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలను పక్కదోవ పట్టించేందుకే పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సాఫ్ట్ గా మాట్లాడితే మేము కూడా సాఫ్టుగానే మాట్లాడుతామని, ఆయన హార్డ్ గా మాట్లాడితే తాము కూడా అదే బాటను అనుసరిస్తామని అమర్నాథ్ హెచ్చరించారు.

జీ20 సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు
- ఇదిలా ఉండగా, ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. అలాగే మార్చి 28,29 తేదీలలో జరుగునున్న జి20 సదస్సును కూడా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో  సూచించారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖను, ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని ఆయన చెప్పారు. 
- జి20 సదస్సుకు 45 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, ఇందుకోసం విశాఖను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అమర్నాథ్ తెలియజేశారు. క్యాపిటల్ సిటీలో జరగనున్న ఈ సదస్సులపై ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ ఉంటుందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. సుమారు 150 కోట్ల రూపాయల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు అమర్నాథ్ వివరించారు.

Back to Top