వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పాలన

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాలసీలో ఎలాంటి మార్పు లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారు. పరిపాలన రాజధాని విశాఖకు తరలించేందుకు త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన జరుగుతుందని చెప్పారు. రాజధాని కోసం విశాఖలో ఒక సెంటు ప్రైవేట్‌ భూమి కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top