రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా వైయ‌స్ జగనే రావాలి.. కావాలి

మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

శ్రీ‌కాకుళం: రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా వైయ‌స్ జగనే రావాలి.. వైయ‌స్ జ‌గ‌నే కావాల‌ని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.  పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు.  అనంతరం రైల్వే క్రీడా మైదానంలో జరిగిన బహిరంగ సభలో  మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే...ఆయన మాటల్లోనే

 అందరికీ నమస్కారం, చాలా సంతోషం, ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల సాకారమవుతోంది. ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ముందు దేవుణ్ని మొక్కి మొదలుపెడతాం, తర్వాత పని పూర్తయిన తర్వాత అదే దేవుణ్ని మొక్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాం, ఈ ప్రాంతంలో వేలాదిమంది ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్ధితులు చూశాం, నేను ఈ ప్రాంత వైద్యుడిగా ప్రత్యక్షంగా చూశాను, ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవుడు పంపిన స్వరూపమే మన సీఎం, కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, వందల మంది ఉద్యమాల బాట పట్టారు, మా కష్టాలు, కన్నీళ్ళు ఎవరైనా తుడవకపోతారా ఎదురుచూసిన ప్రాంతం ఇది, వారికి సంజీవనిలా మీరు వచ్చారు, ఇది అతిపెద్ద భగీరథ ప్రయత్నం మీరు చేశారు, అనేక అడ్డంకులు దాటి పూర్తిచేసిన మీ సంకల్పానికి సలాం, పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు, రెండు కొబ్బరి పంట, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గమైన అదనపు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌కు సైతం శంకుస్ధాపన చేసిన మీకు కృతజ్ఞతలు. ఈ రోజు ప్రతిపక్షం మాటలు, కొన్ని పత్రికలు చూపుతున్న వక్రబాష్యాలు చూస్తున్నాం, వారందరికీ నేను ఒకటే చెబుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్, ఆర్బీకేలు అభివృద్దిలో భాగం కాదా, విద్యావ్యవస్ధలో నాడు నేడు గొప్ప కార్యక్రమం, ఇవి అభివృద్ది కాదా, ఇక్కడ ప్రజలు వలసలు పోతున్నారంటున్నారు, కానీ ఇక్కడ మూలపేట పోర్టు పూర్తయితే ఈ జిల్లాకే వలసలు మొదలవుతాయి, భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖను రాజధాని చేయాలని, ఉత్తరాంధ్ర అభివృద్దికి మీరు చేస్తున్న సంస్కరణలు చిరస్మరణీయం, రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్‌ గారే రావాలి, కావాలి, మీరు సీఎంగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం, మీరు వెనక్కి తగ్గద్దు, గెలిచేవారికే టికెట్లివ్వండి, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇదే సంకల్పం తీసుకోవాలి, మన జగనన్న సీఎం కావడం కోసం మనమంతా నడుం బిగించాలి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను, ఈ నియోజకవర్గంలో ఉన్న నౌపాడ, వెంకటాపురం రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదనలు అందజేశాం, మంజూరు చేయాలని కోరుతున్నాను. మాది వంశధార శివారు ప్రాంతం కాబట్టి హిరమండలం ఎల్‌ఐ స్కీమ్‌ ఇచ్చారు, దీనికి లింక్‌గా రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం, మంజూరు చేయగలరు, వజ్రపుకొత్తూరు మండలంలోని శివారు ప్రాంతాలకు చిన్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను మంజూరు చేయాలని కోరుతున్నాం. అనేక పనులు పూర్తిచేయమని మీరు నిధులు ఇచ్చారు, మా పలాస ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు.

తాజా వీడియోలు

Back to Top