సమ‌న్వ‌యంతో ప‌ని చేయాలి

సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల స‌ద‌స్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీ‌కాకుళం: సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని  అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం రూరల్, గార మండలాలు, మున్సిపల్ కార్పోరేషన్ చెందిన సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లు, క‌న్వీన‌ర్లు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు వివరించాల‌ని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాల ధ్యేయం ఒక్కటేనని ఆకలి,కన్నీరు,నిరాశ,నిస్పృహ లో ఉన్న పేదలకు అండగా ఉండడమే అని, ఇదే వైయ‌స్ఆర్‌సీపీ  ప్రధాన ధ్యేయం అని అన్నారు.  పథకాల కారణంగా ఆర్థిక అసమానతలు తొలగి పోతాయన్న ఆలోచనతో పాటు సమాజంలో గౌరవం పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా వీటిని నిష్పక్షపాత ధోరణిలో మీరు అమలు చేస్తూ..లబ్ధిదారులతో పాటు అంతే గౌరవం పొందు తున్నారు అని చెప్పారు. మీకు మీ ప్రాంతాల్లో గౌరవం పొందేందుకు,అదే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు దక్కేందుకు ఒకే ఒక్క కారణం మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేకపోవడమేనని అన్నారు.  

ఇంకా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు రాజదాని అమరావతిలో పెడతా అంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృ ద్ధి చేసుకోవడానికే చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే హైదరాబాద్ నుంచి మనం ఎలా అయి తే వచ్చామో,అలాంటి పరిస్థితితే భవిష్యత్ కాలంలో రావొచ్చు.. మన మౌనాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు ఇలాంటి మాట లు అంటున్నారు. నిత్యావసర ధరలు అన్నవి దేశం మొత్తం మీద పెరిగాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. 

ఒక్క పైసా లంచం లేకుండా అన్ని అందిస్తున్నాం. పథకాల వర్తింపులో కులం అడగలేదు, మతం చూడలేదు. ప్రాంతం అన్న పట్టింపు కూడా లేదు. అదేవిధంగా విద్యా రంగ ఉన్నతికి కూడా కృషి చేస్తున్నాం. పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బెల్టులు అన్ని ఇస్తున్నాం. అదేవిధంగా పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తూ, ఏడాదికి పదిహేను వేల రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. డ్రాపౌట్ల నివారణకు వీలున్నంత ఎక్కువ దృష్టి సారిస్తూ,విద్యారంగం లో ఉన్నతి సాధించేం దుకు,మెరుగయిన ఫలితాలు అందుకునేందుకు కృషి చేస్తూ ఉన్నాం. స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదు. కానీ ఇప్పుడు మేము చదువుకోగలము అనే ధైర్యం కలిగించింది మన ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఏడు రైతులకు సహాయం అందిస్తున్నాం. ఏదేమయినప్పటికీ వీటన్నింటినీ క్షేత్ర స్థాయిలో వివరించండి. వాస్త విక దృక్పథంతో మాట్లాడండి. కొందరు (విపక్షాలను ఉద్దేశించి) అభివృద్ధి జరగలేదు అని కొందరు అంటున్నారు. రోడ్లు బాగోలేదు అంటున్నారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రాలో రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇక్కడ ఉం డేందుకు ఆయనకు ఇల్లు కూడా లేదు. వచ్చే ఏడాది జనవరి నుంచి పెన్షన్ రూ.2,750 ఇవ్వనున్నాం. పింఛను పెంచమని ఎవ్వ రైనా అడిగారా ? లేదు కదా,  చూశారా ఎంత నిబద్ధత కలిగిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ అన్నది. చూశారా..ఇవే మాటలు మీ ఊళ్లలోకి వెళ్లి మాట్లాడండి. ఊళ్లలో ఉన్న టీడీపీ వాళ్ళకే ముందు వెళ్లి అడగండి..మీకు ఏ పథకం వస్తుంది అని..అప్పుడు వాస్తవాలు ఏంటన్న వి తెలిసి వస్తాయి. పెంచిన పెన్షను ప్రకారం సంబంధిత నగదు పంపిణీ అన్నది జనవరి 3 నుంచి 9 వ తేదీ వరకు చేపట్టనున్నాం. కొత్తగా నియమితులైన సచివాలయ కన్వీనర్లు,గ్రామ / వార్డు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి. పింఛన్ల పంపిణీ సమయంలో సచివాలయం కన్వీనర్లు తమ పరిధిలోని వీలైనన్ని ఎక్కువ ఇళ్ళను సందర్శించి, పంపిణీ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. పింఛను అందజేసేటప్పుడు కన్వీనర్లు లబ్ధిదారులను పలకరించి,లేఖలోని జగనన్న సందే శాన్ని చదివి వినిపించాలి.సచివాలయ కన్వీనర్లు, గ్రామ / వార్డు వలంటీర్ల నెలవారీ జరిగే పింఛను పంపిణీ ప్రక్రియ షెడ్యూల్-కు ఆటంకం కలిగించకుండా..వారితోపాటు కలిసి,వీలైనన్ని ఎక్కువ గృహాలను సందర్శించాలి.

మరోవైపు దొంగలు ఈ రాష్ట్రంలో రాబోతున్నారు..విశాఖపట్నం రాజధానిగా సాధించాలి. అందుకు వైయ‌స్ఆర్‌సీపీని నిలబెడదాం.. ఇదేం కర్మ అంటూ కొందరు తిరుగుతున్నారు.. ఈ కర్మ అంతా గత ప్రభుత్వం వల్లనే ఈ రాష్ట్రానికి వచ్చింది. ఊళ్లో ఉన్న స్కూల్, సచివాలయం భవనం చూడండి. ఇది కదా, అసలైన మార్పు. ఇది చంద్రబాబు కి కర్మ లా కనిపిస్తుంది అంతా.. మన జిల్లా అభి వృద్ధిలో భాగం గా వంశధార దగ్గర రూ.180 కోట్లతో లిఫ్ట్ పెట్టి మండు వేసవిలో రైతులకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉ న్నాం. ఇది సీఎం వైయ‌స్‌ జగన్ కి మన జిల్లా పట్ల ఉండే చిత్తశుద్ధి కాదా అని అడుగుతున్నాను. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా రు. ఒక్కరోజైనా నేరడి బ్యారేజీ విషయమై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో మాట్లాడారా ? లేదు. 
ఉద్దానానికి రూ. 700 కోట్లతో మంచి నీటి ప్రాజెక్టు అందించనున్నాం. పనులు జరుగుతున్నాయి. వంశధార జలాలు ఈ ప్రాంతానికి అందనున్నాయి. సర్ఫేస్ వాటర్ అందించి ఈ ప్రాంతంలో తద్వారా ఎప్పటి నుంచో నెలకొని ఉన్న సమస్యకు పరిష్కారం ఇవ్వను న్నాం. తద్వారా కిడ్నీ వ్యాధి నియంత్రణకు కృషి చేయనున్నాం. పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసమే సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే ఈ ప్రాంత వాసుల కన్నీటి బాధ పోనుంది.    

సచివాలయ కన్వీనర్స్ జనవరి మూడు నుంచి 9వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ  చేయడంలో భాగం కావాలి. అవినీతికి తావు అన్నది లేకుండా,మధ్య వర్తుల ప్రమేయం అన్నది లేకుండా సంక్షేమం అమలు చేస్తుంటే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు..అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు బోడి గుండు మిగులుతుంది. ప్రజా స్వామ్యంలో ప్రజలదే అధికారం. గత ప్రభుత్వం హయాంలో ఎందుకు మేము ఇస్తున్న పథకాలు ఇవ్వలేకపోయారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలు నిజాయితీగా పని చేస్తున్నాయి. విపక్ష నాయకులు బాదుడే బాదుడు అని ప్రజల మధ్యకు వస్తున్నారు. ధరల విషయమై వారంతా వాస్తవ దూరం అయిన వ్యాఖ్యలేవో చేస్తున్నారు. ఒక్కసారి నిత్యావసర ధరలు దేశం మొత్తమ్మీద చూడాలి.  

ఈ రాష్ట్రానికి కర్మ ఎవరికి పట్టింది ? ఎవరి వల్ల పట్టింది ? చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధికి దూరంగా వదిలిపెట్టారు. మన ఆస్పత్రి గత ప్రభుత్వం హయాంలో చూశారా ? ఇప్పుడు చూడండి. అన్ని సదుపాయాలు కల్పిం చాం. అత్యాధునిక టెక్నాలజీని ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చాం. ప్రైవేటు ఆస్పత్రికి దీటుగా మన ప్రభుత్వ ఆస్పత్రిని తీర్చి దిద్దాం. అనుభవజ్ఞులైన డాక్టర్లను నియమించాం. మన పెద్ద మార్కెట్ కు గతంలో అధికారంలో ఉండగా చంద్రబాబు ఒకసారి, సంబంధిత మంత్రి ఒకసారి వచ్చారు. కానీ చేసింది శూన్యం. మన ప్రభుత్వం ఏర్పడ్డాక మార్కెట్ స్థితి ఒకసారి చూడండి. మన వీధుల్లో ఉండే ప్రభుత్వం బడులను ఒకసారి చూడండి. మన నియోజవర్గంలో సుమారు రూ.1000 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశాం. ఇందుకు గాను ఎవ్వరికీ నయాపైసా లంచం ఇచ్చిందీ లేదు.తీసుకున్నదీ లేదు.  

అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులు ఆఖరికి అరసవల్లి వస్తాం అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోయారు. అమరావతి అన్నది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోసం ఏర్పాటు చేసుకున్న నగరం. విశాఖను పాలన రాజధానిగా చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు రాజధాని పనుల నిమిత్తం మన తాతలు చెన్నై వెళ్లారు. తండ్రులు కర్నూలు వెళ్లారు. తర్వాత మనం హైదరాబాద్ వెళ్లాం. మన పిల్లలు ఉదయం వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే విధంగా సీఎం వైయ‌స్ జగన్ రాజధానిని మన దగ్గరకు తీసుకు వస్తున్నారు. రాజధాని వస్తే ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. మన అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు బుద్ధిని మన ప్రజలకు తీయజేయాలి. యెల్లో మీడియా నిర్వాహకులు పచ్చి అబద్ధాలు మాత్రమే వేస్తారు.అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

కార్యక్రమంలో శ్రీకాకుళం ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు డివిజి శంకర్ రావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు,  రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్లు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు మాజీ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, వార్డు ఇంచార్జ్లు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top